తుస్సుమన్న అంగన్‌వాడీల సమ్మె ఎత్తుగడ
సమ్మె పేరుతో ఆడవాళ్ల మీద దౌర్జన్యం చేసేలా ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి, చూశారా కాల్పులు జరిపారు. జీతం పెంచమన్నందుకు జనాన్ని చంపేశారు అని బజారుకెక్కి గోల చేసి, జగన్‌ని అప్రతిష్టపాలు చేయాలని వారి దురాలోచన..!
ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీలు పెద్ద ఎత్తున సమ్మె చేశారు. రెండు కమ్యూనిస్టు పార్టీలూ వాళ్ల వెనక గట్టిగా నిలబడ్డాయి. ఈ అర్జెంటు సమ్మె వెనక ఒక రాజకీయ దురుద్దేశం ఉందని జగన్ ప్రభుత్వం పసిగట్టింది. సమ్మెని కొనసాగనిచ్చింది. అంగన్‌వాడీల్లో అసహనం పెరిగిపోయింది. ప్రభుత్వం ఉదారంగా వాళ్ల డిమాండ్లను అంగీకరించి, బాధ్యతాయుతంగా వ్యవహరించింది. సమ్మె ముగిసిపోయింది. మేం సాధించాం. మేం గెలిచాం అంటూ సీపీఎం, సీపీఐలు గంభీరంగా ప్రకటించాయి. నిజానికి ఆ పార్టీలు తీవ్ర నిరాశలో కూరుకుపోయాయి. వాళ్ల ఎత్తుగడ పారలేదని మొహం మాడ్చుకున్నాయి.
తెరవెనుక కథ: సీపీఐ నారాయణ, సీపీఎం శ్రీనివాసులూ, రాఘవులూ అనే కామ్రేడ్ కమ్మనాయకులు చంద్రబాబుని అధికారంలోకి తెచ్చే బ్రోకర్ పనిని భుజానికెత్తుకున్నారు. దానికోసం బూజుపట్టిన పాత ఐడియా ఒకటి వేశారు. సమ్మె పేరుతో ఆడవాళ్ల మీద దౌర్జన్యం చేసేలా ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి, చూశారా కాల్పులు జరిపారు. జీతం పెంచమన్నందుకు జనాన్ని చంపేశారు అని బజారుకెక్కి గోల చేసి, జగన్‌ని అప్రతిష్టపాలు చేయాలని వారి దురాలోచన..!
ఒక పాత సంఘటనను రిపీట్ చేయడం ద్వారా తమ పాచిక పారుతుందని కామ్రేడ్స్ సంబరపడ్డారు. అది 2000 సంవత్సరం ఆగస్టు 28వ తేదీ. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ చౌరస్తాలో వేలమంది సీపీఐ, సీపీఎం కార్యకర్తలు ఊరేగింపు తీశారు. వాళ్ల భుజానికున్న చేతిసంచుల్లో రాళ్లు ఉన్నాయి. పోలీసులు కనపడగానే, వాళ్లని రాళ్లతో విచ్చలవిడిగా కొట్టారు. దీంతో రెచ్చిపోయిన చంద్రబాబు నాయుడి పోలీసులు కమ్యూనిస్టు కార్యకర్తల మీద విచ్చలవిడిగా లాఠీచార్జ్ చేశారు. వాటర్ కేనన్స్‌తో చెదరగొట్టారు. తుపాకులు ఎక్కుపెట్టి కాల్పులు జరిపారు. బుల్లెట్లు దూసుకుపోయి ముగ్గురు కామ్రేడ్స్ మరణించారు. విద్యుత్ చార్జీలు తగ్గించమని అడిగినందుకు కార్యకర్తల్ని హత్య చేసిన చంద్రబాబు నీచ్ కమీనే కుత్తేగాడని నారాయణా, రఘవులూ చెడతిట్టారు.
ఆ తరువాత కొద్దికాలానికి జరిగిన ఎన్నికల్లో ఈ ప్రచారం పనిచేసి, చంద్రబాబు ఘోరంగా ఓడిపోయాడు. ఇప్పుడూ అదే గేమ్ ఆంధ్రలో ఆడి జగన్ని ఓడించాలని ఓ చవకబారు ఎత్తుగడ వేశారు కామ్రేడ్స్. కమ్యూనిస్టు నాయకుల నీచత్వం ఏమిటంటే.. అప్పుడు నరహంతకుడు చంద్రబాబు అన్నవాళ్లే.. ఇప్పుడు చంద్రబాబు భజన సంఘాలుగా మారిపోయారు. చిన్న ఉద్యోగులైన అంగన్‌వాడీలను బలిచేసి, జగన్‌ని భ్రష్టుపట్టించి, బాబుని గద్దె ఎక్కించాలని భారీ కుట్రపన్నారు.
సమస్య పరిష్కారమూ, సమ్మె ముగిసిపోవడంతో, చితిమంటల్లో కమ్మని రాజకీయ వంటలు చేసుకుందామన్న ఎత్తుగడ చిత్తయిపోయింది. చివరికి కుట్రదారులుగా, రాజకీయ నటులుగా నిరాశతో మిగిలిపోయిన దొంగ కమ్యూనిస్టులు ఒక కొత్తదారులు వెతుక్కోవడంలో బిజీగా ఉన్నారు. అటు నారా వారు రామభజన చేస్తున్నా, వీళ్లు చంద్రబాబు చెక్క భజన మాత్రం మానరు.