టీడీపీ నేత పట్టాభికి బెయిల్ మంజూరు.. కస్టడీ పిటిషన్ కొట్టివేత
3 నెలల పాటు పోలీస్ స్టేషన్‌కు పట్టాభి సహా మిగిలినవారు హాజరు కావాలని ఆదేశిస్తూ.. రూ.25 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది కోర్టు. పోలీసుల కస్టడీ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.
టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సహా నిందితులందరికీ షరతులతో కూడిన బెయిల్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం మంజూరు చేసింది. ప్రతి గురువారం 3 నెలల పాటు పోలీస్ స్టేషన్‌కు పట్టాభి సహా మిగిలినవారు హాజరు కావాలని ఆదేశిస్తూ.. రూ.25 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది కోర్టు. పోలీసుల కస్టడీ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.
సంకల్పసిద్ధి స్కాంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధం ఉందని గతంలో టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. ఆ తరువాత వైసీపీ నేతలు ప్రత్యారోపణలు చేశారు. దీంతో గన్నవరంలో ఇరువర్గాల మధ్య గొడవలు జరిగాయి.
టీడీపీ ఆఫీసుపై వైసీపీ దాడి చేసిందని, అడ్డుకోవడానికి వెళ్లిన తమని అరెస్టు చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ గొడవల్లో సీఐ కనకరావు కూడా గాయపడ్డారు. గన్నవరం గొడవలకు సంబంధించి టీడీపీ నేత పట్టాభి సహా 15 మందిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.
కోర్టులో ప్రవేశపెట్టగా నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. తాజాగా పట్టాభితో సహా అరెస్టు అయిన వారందరికీ షరతులతో కూడిన బెయిన్ మంజూరైంది.