షర్మిల టికెట్లు అమ్ముకున్నారు.. కాంగ్రెస్ సీనియర్ సంచలనం
ఇది రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాదని, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటూ షర్మిలకు చురకలు అంటించారు చింతా మోహన్. ఈసారి ఏపీలో కాంగ్రెస్ ప్రజాస్వామ్యయుతంగా పని చేయలేదని చెప్పుకొచ్చారు.
ఏపీసీసీ చీఫ్ షర్మిలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత మొదలైందా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. షర్మిల తీరుతో కాంగ్రెస్ నష్టపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతా మోహన్. షర్మిలపైనా సంచలన ఆరోపణలు చేశారు. ఆరు నెలల క్రితం కాంగ్రెస్ పునర్‌వైభవం సాధిస్తుందని ఆశించామని, కనీసం 5-10 అసెంబ్లీ సీట్లు, 2-5 ఎంపీ సీట్లు గెలుస్తామని భావించామన్నారు. కానీ కొన్ని పొరపాట్ల వల్ల ఆశించిన ప్రయోజనం దక్కలేదన్నారు.
పీసీసీ చీఫ్ షర్మిల రాంగ్ స్ట్రాటజీ ఫాలో అయ్యారన్నారు చింతా మోహన్. సీనియర్లను కలుపుకుని వెళ్లడంలో షర్మిల ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. 175 నియోజకవర్గాల్లో కమిటీలు ఉన్నా వారితో షర్మిల ఏనాడూ మాట్లాడలేదన్నారు. ఇక టికెట్ల కేటాయింపు విషయంలో షర్మిలపై తీవ్ర ఆరోపణలు చేశారు చింతా మోహన్. షర్మిల ప్రజాస్వామ్యబద్ధంగా టికెట్లు ఇవ్వలేదన్నారు. ఇది వాస్తవమన్నారు. టికెట్ల విషయంలో డబ్బులు చేతులు మారాయన్న ప్రచారం ఉందన్నారు.
ఇది రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాదని, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటూ షర్మిలకు చురకలు అంటించారు చింతా మోహన్. ఈసారి ఏపీలో కాంగ్రెస్ ప్రజాస్వామ్యయుతంగా పని చేయలేదని చెప్పుకొచ్చారు. చింతా మోహన్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పార్టీలో చేరిన షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించింది కాంగ్రెస్ పార్టీ. షర్మిలకు పీసీసీ అప్పగించడాన్ని అప్పట్లోనే హర్ష కుమార్ లాంటి సీనియర్ నేతలు వ్యతిరేకించారు.