వివేకా హత్యలో అసలు నిజమేమిటి?
వివేకా హత్య కేసును అవినాష్ ద్వారా ఎలాగైనా జగన్ మెడకు చుట్టాలన్నదే ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా ఆలోచన. కానీ జగన్ మీడియా తాజా కథనంలో పూర్తి విరుద్ధంగా ఉంది.
వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవం ఏమిటనే విషయంలో గందరగోళం పెరిగిపోతోంది. సీబీఐ కోర్టులో సీబీఐ దాఖలు చేసిన ఫైనల్ చార్జిషీటులో ఏముందనే విషయం ఇప్పుడు అయోమయంగా తయారైంది. ఎందుకంటే ఫైనల్ చార్జిషీటులోని అంశాలు ఇవే అంటూ మీడియాలో పరస్పర విరుద్ధమైన కథనాలు కనిపించాయి. జగన్మోహన్ రెడ్డి మీడియాలో ఏమో సీబీఐ ఔట్ అని శుక్రవారమే పెద్ద కథనం ఇచ్చింది. దాంతో ఎల్లో మీడియా ఉలిక్కిపడింది. ఎందుకంటే సీబీఐ ఫైనల్ చార్జిషీటు వివరాలను బహుశా వాళ్ళు మిస్సయ్యుండచ్చు.
జగన్ మీడియా ప్రకారం గూగుల్ టేక్ అవుట్ సాంకేతికతను తప్పుగా అర్థంచేసుకున్నట్లు సీబీఐ చెప్పింది. దాని ప్రకారం వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్, సునీల్ యాదవ్‌కు హత్యతో సంబంధాలున్నట్లు ఆధారాలు లేవు. అంటే పై నలుగురిపైన సీబీఐ చేసిన అభియోగాలన్నీ తప్పే. కాటట్టి కేసులో నుండి వీళ్ళు బయటపడిపోతారు. ఈ కథనంలో వివరాలు ఎల్లో మీడియాకు జీర్ణం అయినట్లులేదు. ఎందుకంటే వీళ్ళ ఉద్దేశం ప్రకారం అవినాష్, భాస్కరరెడ్డి కేసులో ఇరుక్కోవాలి. నిజానికి ఎల్లో మీడియా కసంతా అవినాష్, భాస్కర్ మీద కాదు. వీళ్ళ ద్వారా జగన్ను ఇబ్బందిపెట్టడమే.
వివేకా హత్య కేసును అవినాష్ ద్వారా ఎలాగైనా జగన్ మెడకు చుట్టాలన్నదే ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా ఆలోచన. కానీ జగన్ మీడియా తాజా కథనంలో పూర్తి విరుద్ధంగా ఉంది. అందుకనే శనివారం ఎల్లో మీడియా బ్యానర్ కథనాలతో రెచ్చిపోయింది. ఇందులో జగన్ మీడియా కథనాలకు పూర్తి విరుద్ధంగా ఉంది. అవినాష్, భాస్కర్, ఉదయ్‌కి హత్యతో సంబంధాలున్నాయని చార్జిషీట్లో సీబీఐ చెప్పిందట. వివేకాది రాజకీయ హత్యే అని షర్మిల కూడా వాగ్మూలం ఇచ్చారట. జగన్ మీడియాలో ఏమో వివేకా హత్యకు కడప ఎంపీ సీటు కారణం కాదని షర్మిల వాగ్మూలం ఇచ్చినట్లు రాశారు.
ఎల్లో మీడియా ఏమో గూగుల్ టేక్ అవుట్‌తో పాటు ఇతర సాంకేతిక ఆధారాలతో సాక్ష్యాలను బయటకు లాగుతున్న సీబీఐ అని రాసింది. కానీ సాక్షి మీడియా మాత్రంలో గూగుల్ టేక్ అవుట్ సాంకేతికతను రీడ్ చేయటం పొరబాటు చేసినట్లు అంగీకరించిందని రాశారు. మొత్తానికి ఇలాంటి పరస్పర విరుద్ధమైన కథనాలతో జనాలకు మీడియా పిచ్చెక్కించ్చేస్తోంది. వివేకా ఎటూ లేరు కాబట్టి సీబీఐ విచారణలో తాను ఏమి చెప్పాననే విషయాన్ని షర్మిల బయటకు చెబితే జనాలకు క్లారిటీ వస్తుంది. మిగిలింది కోర్టు విచారణలో బయటపడుతుంది.