వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడపై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడపై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
BY Vamshi Kotas4 March 2025 8:14 PM IST

X
Vamshi Kotas Updated On: 4 March 2025 8:14 PM IST
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై జనసేన నేతలు పలు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దువ్వాడపై గుడివాడ, మచిలీపట్నం, పామర్రు, పెడన, తిరువూరు, అవనిగడ్డ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. దువ్వాడపై చర్యలు తీసుకోవాలని అమలాపురం డీఎస్పీకి జనసేన మహిళా కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. మరోవైపు దువ్వాడకు వ్యతిరేకంగా జనసేన శ్రేణులు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.ప్రశ్నించకుండా ఉండటానికి పవన్ కల్యాణ్ రూ. 50 కోట్లు తీసుకున్నారని దువ్వాడ శ్రీనివాస్ అన్నారని ఫిర్యాదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో జనసేన నేతలు కోరారు.
Next Story