ఏపీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు మరింత పెంపు అంటూ ఫేక్ జీవో... పోలీసులకు పిర్యాదు.
ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పరిమితిని మరో మూడేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని, ఈ మేరకు జీవో ఎంఎస్ నంబర్ 15ను ప్రభుత్వం శనివారం జారీ చేసిందని ఓ ఫేక్ జీవో కాపీ సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది.
ఏపీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు మరింత పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంతకుముందు 60 ఏళ్లుగా ఉన్న ఏపీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62కి పెంచుతూ నిర్ణయించారు.
అయితే తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పరిమితిని మరో మూడేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని, ఈ మేరకు జీవో ఎంఎస్ నంబర్ 15ను ప్రభుత్వం శనివారం జారీ చేసిందని ఓ ఫేక్ జీవో కాపీ సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది.
దీనిపై స్పందించిన ఏపీ ఆర్థిక శాఖ అధికారులు ఈ ఫేక్ జీవీ పై గుంటూరు రేంజ్ డీఐజీకి పిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఎస్పీని డిఐజీ ఆదేశించారు.