Telugu Global
Andhra Pradesh

బాబు, పవన్‌ల ఫ్రస్ట్రేషన్‌ పీక్స్‌కి.. జగన్‌పై నోటి దురుసు వ్యాఖ్యలపై ఫిర్యాదు

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ గురించి ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌ను ఉద్దేశించి నీ అమ్మా మొగుడిదా, అమ్మమ్మ మొగుడిదా, నానమ్మ మొగుడిదా అంటూ తీవ్ర స్థాయిలో దూషణలకు దిగారు.

బాబు, పవన్‌ల ఫ్రస్ట్రేషన్‌ పీక్స్‌కి.. జగన్‌పై నోటి దురుసు వ్యాఖ్యలపై ఫిర్యాదు
X

బాబు, పవన్‌ల ఫ్రస్ట్రేషన్‌ పీక్స్‌కి చేరుకున్నట్టుంది. తాము ఎంతమంది కూటమి కట్టి వచ్చినా.. ఎంతమందితో కుట్రలు పన్నినా.. ఎంతమందితో దుష్ప్రచారం చేయించినా.. ఎన్ని అబద్ధాలు వల్లె వేసినా.. జగన్‌కి జనంలో ఉన్న ఆదరణ అణువంతైనా తగ్గకపోగా.. మరింత పెరుగుతుండటం వారికి నిద్రపట్టనీయడం లేదనుకుంటా. ఆ విషయం వారి ప్రసంగాల్లోనే అర్థమవుతోంది. జగన్‌పై ఇప్పటికే బహిరంగ సభల్లో నోటికొచ్చినట్టు దూషణలతో తెగబడుతున్న బాబు, పవన్‌లు.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి మహిళలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. చంద్రబాబు, పవన్‌ల వ్యాఖ్యలపై మండిపడ్డ ఏపీ మహిళా కమిషన్‌ ఈ విషయంపై ఎలక్షన్‌ కమిషన్‌కు మంగళవారం ఫిర్యాదు చేసింది.

అసలేం జరిగిందంటే..

అనకాపల్లిలో నిర్వహించిన ఎన్నికల సభలో చంద్రబాబు మహిళల సమక్షంలోనే మహిళలను కించపరిచేలా నిస్సిగ్గుగా మాట్లాడారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ గురించి ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌ను ఉద్దేశించి నీ అమ్మా మొగుడిదా, అమ్మమ్మ మొగుడిదా, నానమ్మ మొగుడిదా అంటూ తీవ్ర స్థాయిలో దూషణలకు దిగారు. దీనిపై ఏపీ మహిళా కమిషన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తల్లి మొగుడిదా అంటూ అంత వయసున్న బాబు ఎలా మాట్లాడతా రని, మహిళను, మాతృమూర్తి స్థానాన్ని అవహేళన చేస్తూ మాట్లాడటం బాధాకరమని వారు మండిపడ్డారు. పవన్‌ కూడా సీఎం జగన్‌ను ఉద్దేశించి నీ అమ్మ మొగుడు వచ్చినా భయపడనన్నారని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వెంకటల‌క్ష్మి మాట్లాడుతూ మహిళలను గౌరవించలేని వ్యక్తులు రాజకీయాలు ఎలా చేస్తారని ఆవేదన వ్యక్తం ప్రశ్నించారు. మహిళలను కించపరిచి, బెదిరించిన ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘానికి, జాతీయ మహిళా కమిషనకు లేఖ ద్వారా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

First Published:  8 May 2024 11:51 AM IST
Next Story