కొత్త బాణం రెడీ అయ్యిందా..?
జగనన్న వదిలిన బాణం అని షర్మిల తనను తానే జనాలకు పరిచయం చేసుకున్నారు. అలాగే రోడ్డు షోలు, ర్యాలీల్లో బాగా పాపులరయ్యారు.
రాజకీయాల్లో బాణం అనే పదానికి అన్నీ విధాల పేటెంట్ హక్కులు వైఎస్ షర్మిలకు మాత్రమే ఉన్నాయి. అయితే తన హక్కులను షర్మిలే స్వచ్ఛందంగా వదులుకున్నారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మీడియాలో ఎవరో ఆమెను జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం అని ఏదో ప్రశ్నించారు. దానికి షర్మిల మండిపోయి తనను ఇకనుండి జగనన్నబాణం అని అనద్దని స్పష్టంగా చెప్పారు. కాబట్టి బాణంపై పేటెంట్ హక్కు వదులుకున్నట్లే అర్థం చేసుకోవాలి.
వెంటనే మరో బాణం రెడీ అయిపోయింది. ఈ కొత్త బాణం ఎవరంటే.. సినీనటుడు కమ్ పొలిటీషియన్ పృథ్వీ. మీడియాతో పృథ్వీ మాట్లాడుతూ తాను చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ వదిలిన కొత్త బాణంగా తనకి తాను సెల్ఫ్ ప్రమోట్ చేసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ కు తన తడాఖా ఏమిటో చూపిస్తానని ఛాలెంజ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీచేయటం లేదని చెప్పేశారు. ఎందుకంటే రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయాలట. అందుకనే తనను తాను చంద్రబాబు, పవన్ వదిలిన బాణంగా ప్రకటించుకున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. జగనన్న వదిలిన బాణం అని షర్మిల తనను తానే జనాలకు పరిచయం చేసుకున్నారు. అలాగే రోడ్డు షోలు, ర్యాలీల్లో బాగా పాపులరయ్యారు. జగన్ తరఫున ప్రచారం చేశారు కాబట్టి జగనన్న బాణం అని చెప్పుకున్నా అప్పట్లో జనాలు బ్రహ్మరథం పట్టి షర్మిలను యాక్సెప్ట్ చేశారు. అయితే ఆ తర్వాత జగన్-షర్మిల మధ్య విభేదాల కారణంగా ఏపీ జనాలు జగనన్న బాణాన్ని మరచిపోయారు.
ఇప్పుడు కొత్తగా చంద్రబాబు, పవన్ వదిలిన బాణమని కమెడియన్ పృథ్వీ తనకు తాను ప్రకటించుకుంటే సరిపోతుందా..? చెప్పుకోవటానికి కూడా ఒక స్థాయుండాలన్న విషయాన్ని కమెడియన్ మరచిపోయినట్లున్నారు. షర్మిల కూడా తనను తాను బాణంగా ప్రచారం చేసుకుని పాపులర్ అయ్యారంటే జగన్ చెల్లెలు కాబట్టే. జగన్ లేకపోతే షర్మిల జీరో అన్న విషయం తెలంగాణలో ప్రూవ్ అయ్యింది. మరీ కొత్తబాణం పృథ్వీ పరిస్థితి ఏమిటో తొందరలోనే తేలిపోతుంది.