Telugu Global
Andhra Pradesh

బీసీలకే టాప్ ప్రయారిటీనా..?

బీసీలు మొదటినుంచి టీడీపీతోనే ఉంటున్నారంటే అది ఎన్టీఆర్ పుణ్యమనే చెప్పాలి. అయితే చంద్రబాబు బీసీ బీసీ అంటూ మాటలకు మాత్రమే పరిమితమయ్యారు.

బీసీలకే టాప్ ప్రయారిటీనా..?
X

అధికారంలోకి రాకముందు నుంచే జగన్మోహన్ రెడ్డి బీసీలకు టాప్ ప్రయారిటీ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే ప్రయారిటీ బీసీలకు కంటిన్యూ చేశారు. ఇప్పుడు కూడా అదే ప్రయారిటీ కంటిన్యూ అవుతోంది. తాజాగా విడుదలైన వైసీపీ మూడో జాబితాలో 21 మంది అభ్యర్థులున్నారు. సమన్వయకర్తలు అంటున్నా వీళ్ళందరూ దాదాపు అభ్యర్థులన్నట్లే లెక్క. తాజాగా రిలీజైన జాబితాలో 6 ఎంపీలు, 15 మంది అసెంబ్లీ అభ్యర్థులన్నారు. ఈ మొత్తం జాబితాలో 9 మంది బీసీలున్నారు.

ఆరుగురు ఎంపీలను ఫైనల్ చేస్తే ఇందులో నలుగురు బీసీలు, ఒక కమ్మ, మరో ఎస్సీ అభ్యర్థి ఉన్నారు. టీడీపీకి రాజీనామా చేసి పార్టీలో చేరిన కేశినేని నానీని విజయవాడ ఎంపీ అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. అలాగే 15 మందితో అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తే 5 మంది బీసీలున్నారు. ఇంతకుముందు ప్రకటించిన రెండు జాబితాల్లో కూడా బీసీలకే ప్రయారిటీ ఇచ్చారు. బీసీలకు టాప్ ప్రయారిటీ ఇవ్వటం వల్లే 2019 ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిందని జగన్ బలంగా నమ్ముతున్నారు.

బీసీలు మొదటినుంచి టీడీపీతోనే ఉంటున్నారంటే అది ఎన్టీఆర్ పుణ్యమనే చెప్పాలి. అయితే చంద్రబాబు బీసీ బీసీ అంటూ మాటలకు మాత్రమే పరిమితమయ్యారు. పైగా బీసీ సంఘాలపై నోటికొచ్చినట్లు మాట్లాడి అందరినీ దూరంచేసుకున్నారు. కానీ, జగన్ అలాకాకుండా ప్రయారిటీని యాక్షన్లో చూపించటంతో అప్పటివరకు టీడీపీనే అంటిపెట్టుకున్న బీసీల్లో చీలికవచ్చి వైసీపీకి మద్దతిచ్చారు. దాంతో టీడీపీకి ఘోరపరాజయం తప్పలేదు. అదేపద్దతిని జగన్ ఇప్పుడూ కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీదే విజయమని జగన్ ధీమాగా ఉన్నారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. జ‌గ‌న్‌పై బుర‌దజ‌ల్లేందుకు ఎల్లోమీడియా పిచ్చిరాతలన్నీ రాస్తోంది. బీసీలను వైసీపీకి దూరంచేయాలన్నది ఎల్లోమీడియా ప్లాన్. అభ్యర్థుల ఎంపికలో జగన్ బీసీలను తొక్కేస్తున్నారని గోలచేస్తోంది. ఒక నియోజకవర్గంలో బీసీ ఎమ్మెల్యేని మార్చి రెడ్డికి కేటాయిస్తే ఇంకో నియోజకవర్గంలో రెడ్డి ఎమ్మెల్యేని మార్చేసి బీసీకి కేటాయిస్తున్నారు. ఇక బీసీలకు అన్యాయం చేసిందేముంది..? పైగా పోయిన ఎన్నికల్లో కన్నా రాబోయే ఎన్నికల్లో బీసీలకు మరిన్ని ఎక్కువ సీట్లు ఇస్తున్నారు. దాంతో బీసీలందరూ ఓట్లేసి మళ్ళీ వైసీపీనే గెలిపిస్తారేమో అన్న టెన్షన్ ఎల్లోబ్యాచ్ లో పెరిగిపోతోంది. అందుకనే తప్పుడు రాతలన్నీ రాస్తోంది.

First Published:  12 Jan 2024 10:18 AM IST
Next Story