వీలుకాకుంటే తప్పుకోండి- ఆ ఐదుగురికి సీఎం క్లాస్. పూర్తి జాబితా ఇదే
ప్రాంతీయ సమన్వయకర్తలుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్,బాలినేని శ్రీనివాస్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌లు ఆ పనిలో విఫలమయ్యామరని సీఎం జగన్ సూటిగా చెప్పేశారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లతో నిర్వహించిన సమావేశంలో సీఎం జగన్ ఐదుగురు సమన్వయకర్తలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు సరిగా ప్రజల్లో తిరక్కపోయినా, పనిచేయకపోయినా అక్కడ బాధ్యతలను ప్రాంతీయ సమన్వయకర్తలే తీసుకుని పరిస్థితిని మెరుగుపరచాల్సి ఉంటుందని సీఎం జగన్ చెప్పారు.
కానీ ప్రాంతీయ సమన్వయకర్తలుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్,బాలినేని శ్రీనివాస్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌లు ఆ పనిలో విఫలమయ్యామరని సీఎం జగన్ సూటిగా చెప్పేశారు. మిమ్మల్ని నమ్మి బాధ్యతలు అప్పగించానని.. ఒకవేళ మీకు పనిచేయకపోవడం వీలు కాకపోతే చెప్పండి.. పని చేసేందుకు ఆసక్తిగా ఉన్న వాళ్లను నియమిస్తాం అని సీఎం జగన్ స్పష్టం చేశారు.
పేర్లు చదువుతున్న సమయంలో బుగ్గన రాజేంద్రనాథ్ బయట ఉన్నారు. దాంతో జోక్యం చేసుకున్న సీఎం జగన్.. అప్పటికప్పుడు లోపలికి పిలిపించారు. మీపై ఎంతో నమ్మకంతో ఆర్థిక శాఖను అప్పగించాం.. అలాంటిది మీరే నియోజకవర్గంలో తిరగకపోతే ఎలా అని సీఎం ప్రశ్నించారు.
సీఎం క్లాస్ తీసుకున్న వారి పూర్తి జాబితా ఇదే..
మంత్రులు..
బుగ్గన, రోజా, దాడిశెట్టి రాజా, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, విశ్వరూప్.
ఎమ్మెల్యేలు..
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసుల నాయుడు
గ్రంథి శ్రీనివాస్
స్పీకర్ తమ్మినేని సీతారాం
వల్లభనేని వంశీ
దూలం నాగేశ్వరరావు
మేకతోటి సుచరిత
కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి
పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి
మేడా మల్లికార్డున రెడ్డి
అదీప్ రాజ్
చిర్ల జగ్గిరెడ్డి
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి
రైల్వేకొడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు
బాలినేని శ్రీనివాస్ రెడ్డి
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
తోట త్రిమూర్తులు(మండపేట ఇన్‌చార్జ్)
మార్గాని భరత్- ఎంపీ ( రాజమండి సిటీ అసెంబ్లీ ఇన్‌చార్జ్)