హఫీజ్‌ను రాజ్యసభకు పంపుతా.. బాబుకు నాకు తేడా ఇదే - జగన్
మైనార్టీ వర్గం నుంచి హఫీజ్‌ను రాజ్యసభకు పంపిస్తానన్నారు జగన్. మనసులో కల్మషం లేదు కాబట్టే లక్షల మంది సమక్షంలో ఈ ప్రకటన చేస్తున్నానని చెప్పారు.
కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారు సీఎం జగన్. హఫీజ్ ఖాన్‌కు టికెట్ ఇవ్వలేకపోయానని.. అందుకే తాను హఫీజ్ ఖాన్ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నానని చెప్పారు జగన్. రెండేళ్ల తర్వాత ఖాళీ అయ్యే స్థానంలో రాజ్యసభకు హఫీజ్ ఖాన్‌ను పంపిస్తానని లక్షలాది మంది సమక్షంలో ప్రకటించారు జగన్.
మైనార్టీ వర్గం నుంచి హఫీజ్‌ను రాజ్యసభకు పంపిస్తానన్నారు జగన్. మనసులో కల్మషం లేదు కాబట్టే లక్షల మంది సమక్షంలో ఈ ప్రకటన చేస్తున్నానని చెప్పారు. చంద్రబాబుకు, తనకు తేడా గమనించాలని అక్కడున్న ప్రజలకు సూచించారు. ఎమ్మిగనూరులో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో ఈ ప్రకటన చేశారు జగన్.
2019లో కర్నూలు నుంచి పోటీ చేసిన హఫీజ్ ఖాన్.. ప్రత్యర్థి టీజీ భరత్‌పై 5 వేలకుపైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఐతే ఇన్‌ఛార్జిల మార్పులు, చేర్పుల ప్రక్రియలో భాగంగా ఈ సారి కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్‌ను ఎంపిక చేశారు జగన్. అందుకే హఫీజ్ ఖాన్‌ను రాజ్యసభకు పంపుతున్నానని ప్రకటించారు.