Telugu Global
Andhra Pradesh

సీఎం జ‌గ‌న్‌కి బెణికిన కాలు.. క‌డ‌ప ప‌ర్య‌ట‌న ర‌ద్దు

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఉదయం వ్యాయామం చేస్తున్న సమయంలో కాలు బెణికింది. సాయంత్రానికి నొప్పి తీవ్రం కావ‌డంతో వైద్యులు ప‌రీక్షించారు. ప్రయాణాలు ర‌ద్దు చేసుకోవాల‌ని వైద్యులు ఇచ్చిన సూచ‌న‌ల మేర‌కు క‌డ‌ప జిల్లా ప‌ర్య‌ట‌న‌ను అధికారులు ర‌ద్దు చేశారు.

సీఎం జ‌గ‌న్‌కి బెణికిన కాలు.. క‌డ‌ప ప‌ర్య‌ట‌న ర‌ద్దు
X

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కి మ‌రోసారి కాలు బెణికింది. నొప్పి తీవ్రంగా ఉండ‌డంతో విశ్రాంతి తీసుకోవాల‌ని, ప్ర‌యాణాలు ర‌ద్దు చేసుకోవాల‌ని వైద్యులు స‌ల‌హా ఇచ్చార‌ని స‌మాచారం. దీంతో ఒంటిమిట్ట పర్యటనను అధికారులు ర‌ద్దు చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

సీఎం జ‌గ‌న్ క‌డ‌ప జిల్లా ప‌ర్య‌ట‌న‌కు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఒంటిమిట్ట కోదండ‌రాముని బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. సీతారాముల క‌ళ్యాణోత్స‌వానికి హాజ‌రై సీఎం ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించాల్సి ఉంది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఉదయం వ్యాయామం చేస్తున్న సమయంలో కాలు బెణికింది. సాయంత్రానికి నొప్పి తీవ్రం కావ‌డంతో వైద్యులు ప‌రీక్షించారు. ప్రయాణాలు ర‌ద్దు చేసుకోవాల‌ని వైద్యులు ఇచ్చిన సూచ‌న‌ల మేర‌కు క‌డ‌ప జిల్లా ప‌ర్య‌ట‌న‌ను అధికారులు ర‌ద్దు చేశారు. సీఎం జ‌గ‌న్‌కి గతంలో ఇలానే వ్యాయామం చేస్తున్న‌ప్పుడు కాలికి గాయం అయ్యింది. ఆ గాయంతో చాలారోజులపాటు ముఖ్యమంత్రి ఇబ్బందిప‌డ్డారు.

First Published:  4 April 2023 10:56 PM IST
Next Story