ఒకరు లోకల్, మరొకరునేషనల్, ఇంకొకరు ఇంటర్నేషనల్.. పవన్ పెళ్లిళ్లపై జగన్ కామెంట్స్ వైరల్
ఆయన ఇంట్లో ఇల్లాలు ప్రతి మూడు నాలుగేళ్లకు ఒకసారి మారుతుంటుందని ఎద్దేవా చేశారు. ఒకసారేమో లోకల్ అని , ఇంకోసారి నేషనల్, మరొకసారి ఇంటర్నేషనల్ అని విమర్శించారు. ఇక ఆ తర్వాత ఎక్కడికి పోతాడో అని వ్యాఖ్యానించారు.

ఒకరు లోకల్, మరొకరునేషనల్, ఇంకొకరు ఇంటర్నేషనల్.. పవన్ పెళ్లిళ్లపై జగన్ కామెంట్స్ వైరల్
జనసేన అధినేత మూడు పెళ్లిళ్లపై సామర్లకోట సభలో ముఖ్యమంత్రి జగన్ తాజాగా చేసిన కామెంట్స్ ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇవాళ కాకినాడ జిల్లా సామర్లకోటలో జగనన్న సామూహిక గృహప్రవేశాల కార్యక్రమానికి హాజరైన జగన్.. అక్కడ జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పై మరోసారి వ్యక్తిగత విమర్శలు చేశారు.
దత్తపుత్రుడి శాశ్వత నివాసం హైదరాబాద్.. కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు ప్రతి మూడు నాలుగేళ్లకు ఒకసారి మారుతుంటుందని ఎద్దేవా చేశారు. ఒకసారేమో లోకల్ అని , ఇంకోసారి నేషనల్, మరొకసారి ఇంటర్నేషనల్ అని విమర్శించారు. ఇక ఆ తర్వాత ఎక్కడికి పోతాడో అని వ్యాఖ్యానించారు.
ఆడవాళ్లు అన్నా.. వివాహ వ్యవస్థ అన్నా.. దత్తపుత్రుడికి ఏ పాటి గౌరవం ఉందో ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మన ఇళ్లలోని మహిళలను, పెళ్లిళ్లను మనమే గౌరవించకపోతే ఎలా..? అని ఆయన ప్రశ్నించారు. నాయకుడై ఉండి మూడు నాలుగేళ్లకోసారి ఇల్లాలిని మారుస్తున్నాడని, మహిళలను చులకన భావంతో చూస్తున్నాడని, పవన్ ఎటువంటి నాయకుడో ఆలోచన చేయాలని జగన్ విజ్ఞప్తి చేశారు.
కాగా, పవన్ కళ్యాణ్ పై ముఖ్యమంత్రి జగన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. తనపై వ్యక్తిగత విమర్శలు చేసినా, తన పెళ్లిళ్ల గురించి మాట్లాడినా చెప్పుతో కొడతానని గతంలో పవన్ కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడారు. అయినప్పటికీ వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తూనే ఉన్నారు.
ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్న వారిలో ఒకరు లోకల్ అయితే మరొకరు నేషనల్ అని, ఇంకొకరు ఇంటర్నేషనల్ అని.. ఈ సారి ఇక ఎక్కడికి వెళతాడో అని కామెంట్స్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై అప్పుడే సోషల్ మీడియా వేదికగా రచ్చ మొదలైంది. వైసీపీ, జనసేన మద్దతుదారులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.