Telugu Global
Andhra Pradesh

రైతు భరోసా.. వరుసగా ఐదో ఏడాది

సీఎం వైఎస్‌ జగన్‌ రైతులకు ఇచ్చిన హామీ మేరకు కరోనా వంటి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ రైతు భరోసా కింద రూ.34,228 కోట్ల లబ్ధిని రైతులకు అందించారు.

రైతు భరోసా.. వరుసగా ఐదో ఏడాది
X

రైతులకు పెట్టుబడి సాయంగా వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా సొమ్మును వరుసగా ఐదో ఏడాది కూడా అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. బుధవారం రైతుల ఖాతాల్లో మూడో విడత సొమ్ము జమ చేయనుంది. 2021–22 రబీ, 2022 ఖరీఫ్‌ సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును సైతం చెల్లించేందుకు ఏర్పాట్లు చేసింది.

ఈ రెండు పథకాలకు సంబంధించి అర్హులైన 64.37 లక్షల రైతు కుటుంబాల ఖాతాలకు రూ.1,294.34 కోట్ల సాయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ జమ చేయనున్నారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచే ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ రైతులకు ఇచ్చిన హామీ మేరకు కరోనా వంటి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ రైతు భరోసా కింద రూ.34,228 కోట్ల లబ్ధిని రైతులకు అందించారు. నాలుగేళ్ల పాటు ప్రతి రైతు కుటుంబానికీ రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం వరుసగా ఐదో ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో రూ.11,500 చొప్పున జమ చేసింది. బుధవారం మూడో విడత సొమ్ము ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాలకు జమ చేయనుంది.

First Published:  28 Feb 2024 10:04 AM IST
Next Story