వైద్య పరీక్షలు చేయించుకున్న సీఎం జగన్
ల్యాబ్‌లో పరీక్షల అనంతరం ముఖ్యమంత్రి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తిరిగి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.
BY Telugu Global22 Aug 2023 8:48 AM IST

X
Telugu Global Updated On: 22 Aug 2023 11:20 AM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. విజయవాడ మొగల్‌రాజపురంలో గల ఒక డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు సీఎం సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ల్యాబ్‌కి వెళ్లారు. ముఖ్యమంత్రి ల్యాబ్‌లోనే దాదాపు రెండు గంటలపాటు ఉన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ ఎంఆర్ఐ స్కాన్‌తో పాటు వివిధ రక్త పరీక్షలు చేయించుకున్నట్టు సమాచారం. ల్యాబ్‌లో పరీక్షల అనంతరం ముఖ్యమంత్రి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తిరిగి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ల్యాబ్‌లో పరీక్షల సందర్భంగా సీఎం సతీమణి భారతీరెడ్డి ఆయన వెంట ఉన్నారు.
♦
Next Story