Telugu Global
Andhra Pradesh

పోలింగ్ రోజు ఓటర్లకు సీఎం జగన్ సందేశం

సీఎం జగన్ తన సభల్లో పదే పదే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలంటూ బలహీన వర్గాలందర్నీ తన వాళ్లుగా చెబుతుంటారు. అదే రీతిలో ఆయన ఈరోజు ట్వీట్ వేశారు.

పోలింగ్ రోజు ఓటర్లకు సీఎం జగన్ సందేశం
X

ఏపీలో పోలింగ్ సందర్భంగా ఓటర్లకు సీఎం జగన్ తన సందేశమిచ్చారు. ఉదయాన్నే పోలింగ్ ప్రారంభం కావడానికి కొన్ని నిమిషాల ముందుగా సోషల్ మీడియాలో ఆయన తన సందేశాన్ని ఉంచారు. అందరూ తప్పకుండా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

"నా అవ్వాతాతలందరూ…

నా అక్కచెల్లెమ్మలందరూ…

నా అన్నదమ్ములందరూ…

నా రైతన్నలందరూ…

నా యువతీయువకులందరూ…

నా ఎస్సీ…

నా ఎస్టీ…

నా బీసీ…

నా మైనారిటీలందరూ…

అందరూ కదిలి రండి, తప్పకుండా ఓటు వేయండి!" అంటూ ట్వీట్ వేశారు సీఎం జగన్.


సీఎం జగన్ తన సభల్లో పదే పదే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలంటూ బలహీన వర్గాలందర్నీ తన వాళ్లుగా చెబుతుంటారు. అదే రీతిలో ఆయన ఈరోజు ట్వీట్ వేశారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంతా తప్పకుండా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అవ్వాతాతలు, అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములు, రైతన్నలంతా కూడా తప్పకుండా పోలింగ్ కేంద్రాలకు తరలి రావాలన్నారు.

ఏపీలో బలహీన వర్గాలు, ముఖ్యంగా మహిళలు వైసీపీ వైపు ఉన్నారని అన్ని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. ఆయా వర్గాలకు జగన్ అందించిన సంక్షేమం కొనసాగాలని వారు కోరుకుంటున్నట్టు సర్వే సంస్థలు అంటున్నాయి. జగన్ కూడా ఆయా వర్గాల ఓట్లపైనే గట్టి నమ్మకం పెట్టుకున్నారు. అందుకే వారందర్నీ పోలింగ్ కేంద్రాలకు తరలి రావాలని పిలుపునిచ్చారు. కచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

First Published:  13 May 2024 1:43 AM GMT
Next Story