పంతం నెగ్గించుకున్న జగన్.. ఆర్-5 జోన్ లో నేడే శంకుస్థాపన
ఒక్కో లబ్ధిదారుడి కుటుంబానికి 5 లక్షలనుంచి 10 లక్షల రూపాయల విలువ చేసే భూమి అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఈ విషయంలో ఇప్పటికే చాలా ఆటంకాలు ఎదురైనా ప్రభుత్వం మాత్రం ముందడుగు వేసింది.
ప్రతిపక్షాల విమర్శలు, అమరావతి రైతుల నిరసనలు, కోర్టు కేసులు, కేంద్రం సహాయనిరాకరణ.. ఇలా ఎన్ని అడ్డంకులు వచ్చినా సీఎం జగన్ పంతం నెగ్గించుకున్నారు. అమరావతిలో పేదలకు చోటు కల్పించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తికాగా.. అసలైన ఘట్టం ఈరోజే మొదలవుతోంది. సీఎం జగన్ ఈరోజు పేదల ఇళ్లకు శంకుస్థాపన చేయబోతున్నారు.
పేదల ఇళ్ల లెక్క..
పేదలకు కేటాయించిన స్థలం 1,402.58 ఎకరాలు
లే అవుట్ లు - 25
లబ్ధిదారుల సంఖ్య - 50,793
స్థలం మొత్తం విలువ రూ.1,371.41 కోట్లు
మౌలిక సదుపాయాలకోసం చేస్తున్న ఖర్చు రూ.384.42 కోట్లు
విద్య, వైద్యం, మొక్కలు నాటడం సహా.. మొత్తం ప్రభుత్వానికయ్యే ఖర్చు రూ.1,829.57 కోట్లు
ఒక్కో లబ్ధిదారుడి కుటుంబానికి 5 లక్షలనుంచి 10 లక్షల రూపాయల విలువ చేసే భూమి అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఈ విషయంలో ఇప్పటికే చాలా ఆటంకాలు ఎదురైనా ప్రభుత్వం మాత్రం ముందడుగు వేసింది. ఇళ్ల పట్టాలపంపిణీ తర్వాత ఇంటి నిర్మాణం విషయంలో కూడా న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. కానీ సీఎం జగన్ మాత్రం అమరావతిలో పేదలకు ఇళ్లు కట్టి తీరాల్సిందేనని నిశ్చయించారు. ఈరోజు శంకుస్థాపనకు సిద్ధమయ్యారు.