జగన్ ఫ్లైట్ కదల్లేదు.. మళ్లీ ఏమైంది..?
ఈనెల 17న సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంలో కూడా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. కొన్ని రోజుల వ్యవధిలోనే మళ్లీ ఇప్పుడు విశాఖ పర్యటన సందర్భంగా జగన్ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.
గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం జగన్ విశాఖకు బయలుదేరారు. సడగన్ గా అందులో సాంకేతిక లోపం తలెత్తింది. ఇంకేముంది అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. వెంటనే విమానాన్ని నిలిపివేశారు. ప్రత్యామ్నాయ విమానం లేకపోవడంతో జగన్ తాడేపల్లికి తిరుగు పయనమయ్యారు. అయితే అంతలోనే టెక్నికల్ టీమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే జగన్ ప్రత్యేక విమానంలో విశాఖ బయలుదేరి వెళ్లారు.
రెండోసారి.
ఈనెల 17న సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంలో కూడా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఆయన బయలుదేరిన విమానం కాసేపటికే వెనక్కు వచ్చింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి తిరిగి వెళ్లిన జగన్, ఆ తర్వాతి రోజు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. కొన్ని రోజుల వ్యవధిలోనే మళ్లీ ఇప్పుడు విశాఖ పర్యటన సందర్భంగా జగన్ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.
పాలనా రాజధాని విశాఖపట్నంలో జీ–20 సదస్సు తొలిరోజు సాయంత్రం జరిగే కార్యక్రమాలకు సీఎం జగన్ హాజరవుతారు. సదస్సులోని ప్రతినిధులతో ముఖాముఖి మాట్లాడతారు. ఆ తర్వాత బీచ్ ఒడ్డిన జరిగే గాలా డిన్నర్ లో ఆయన పాల్గొంటారు. రాత్రికి ముఖ్యమంత్రి తిరిగి తాడేపల్లికి వెళ్తారు. ఇదీ ఆయన షెడ్యూల్. అయితే విమానంలో సాంకేతిక లోపం కారణంగా ఈ షెడ్యూల్ కాస్త ఆలస్యంగా మొదలవుతుంది.