వైరల్ గా మారిన జగన్ పోస్టర్.. ట్విట్టర్లో వైసీపీ బీజేపీ మధ్య వార్
వైసీపీ వేసిన పోస్టర్లో ఉన్నది పసిపాప అని క్లియర్ కట్ గా తెలుస్తోంది. కానీ బీజేపీ మాత్రం శివుడికి పాలు పోసి శివతత్వాన్ని బోధించేస్తారా అంటూ ప్రశ్నిస్తోంది.
పండగలకు శుభాకాంక్షలు చెబుతూ ప్రభుత్వాధినేతలు ట్వీట్లు వేస్తుంటారు. వాటిని పార్టీ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి రీట్వీట్ చేస్తుంటారు. ఈ క్రమంలో పోస్టర్లు కూడా వేసుకోవడం సహజమే. అయితే ఏపీలో వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వచ్చిన ఓ పోస్టర్ కలకలం రేపుతోంది. అందులో ఓ పసిపాపకు సీఎం జగన్ పాలు తాగిస్తున్నట్టు ఉంటుంది. దీనిపై ఇప్పుడు బీజేపీ రాద్ధాంతం చేస్తోంది.
అన్నార్తుల ఆకలి తీర్చడమే ఈశ్వరారాధాన.
— YSR Congress Party (@YSRCParty) February 18, 2023
ఆ శివయ్య చల్లని దీవెనలు రాష్ట్ర ప్రజలందరి పై ఉండాలని కోరుకుంటూ…శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. pic.twitter.com/Ww9HMAiWpX
బాల శివుడికి పాలుతాగిస్తారా..?
వైసీపీ వేసిన పోస్టర్లో ఉన్నది పసిపాప అని క్లియర్ కట్ గా తెలుస్తోంది. కానీ బీజేపీ మాత్రం శివుడికి పాలు పోసి శివతత్వాన్ని బోధించేస్తారా అంటూ ప్రశ్నిస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ పోస్టర్ పై మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న గిరిజన సంకేమ హాస్టళ్ళు , BC, SC సంక్షేమ హాస్టళ్లలో ఉండేపిల్లలకు సరిగా తిండిపెట్టలేరు గాని శివుడికి పాలు పోసి శివతత్వా న్ని బోదించేస్తారు మన సీఎం జగన్ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు వీర్రాజు.
రాష్ట్రంలో ఉన్న గిరిజన సంకేమ హాస్టళ్ళు , BC, SC సంక్షేమ హాస్టళ్లలో ఉండేపిల్లలకు సరిగా తిండిపెట్టలేరు గాని
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) February 19, 2023
శివుడికిపాలు పోసిశివతత్వా న్ని బోదించేస్తారు మన @ysjagan గారు.#YSRCP_Insults_Mahadeva @blsanthosh @JPNadda pic.twitter.com/VIV1wdMaia
వైసీపీ నేతలు ఈ శివరాత్రికి సరికొత్తగా శుభాకాంక్షలు చెప్పాలనుకున్నారు. అందుకే సీఎం జగన్ ఉన్న శివరాత్రి శుభాకాంక్షల పోస్టర్ రెడీ చేసి ట్వీట్ చేశారు. గతంలో ఎప్పడూ లేని విధంగా పోస్టర్ పడేసరికి రకరకాల కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. శివలింగానికి పాలాభిషేకం చేయొద్దని మెసేజ్ ఇస్తున్నారా అంటూ కొంతమంది కామెంట్లు చేశారు. పసిపాపలకు పాలుపోయడం ఏమో కానీ, యువతకు జే బ్రాండ్ మద్యాన్ని అలవాటు చేస్తున్నారంటూ మరికొంతమంది ఎద్దేవా చేశారు.
పోస్టర్ వ్యవహారం వైరల్ గా మారడంతో ఇప్పుడు బీజేపీ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలనుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా శివాలయాల వద్ద ఆందోళనలకు పిలుపునిచ్చారు సోమువీర్రాజు. హిందువులను ఉద్దేశపూర్వకంగా వైసీపీ అవమానించిందని అంటున్నారాయన.