బర్రెలక్క పేరు చెప్పి పవన్ ను ర్యాగింగ్ చేసిన జగన్..
ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదన్నారు. ఆయన ఒక నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్ అని ఎద్దేవా చేసారు జగన్.
పలాస బహిరంగ సభలో సీఎం జగన్ మరోసారి ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఎన్నికలను ఉదాహరణగా చెబుతూ పవన్ కల్యాణ్ పై సెటైర్లు పేల్చారు. తెలంగాణలో పోటీ చేసి పవన్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణలో పవన్ డైలాగులు కొట్టారని, ఆఖరికి ఆయనకు డిపాజిట్లు రాలేదని కౌంటర్ ఇచ్చారు. ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదన్నారు. ఆయన ఒక నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్ అని ఎద్దేవా చేసారు జగన్.
ఉత్తరాంధ్రకు చంద్రబాబు, దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదన్నారు జగన్. ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్య ఒక్కరోజులో వచ్చింది కాదని.. గత పాలకుల హయాంలోనూ ఈ సమస్య ఉందని.. పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కే లేదని మండిపడ్డారు. కుప్పం నియోజవర్గానికి కూడా చంద్రబాబు నీరు అందించలేదని, సొంత నియోజకవర్గాన్నే పట్టించుకోని ఆయనకుకు ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుందని విమర్శించారు. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఎత్తులు, పొత్తులు, చిత్తులంటూ చంద్రబాబు కొత్త నాటకాలకు తెరతీస్తుంటారని అన్నారు జగన్.
ఏడుపే ఏడుపు..
విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు జగన్. విశాఖకు సీఎం వచ్చి ఉంటానంటే ఏడుస్తున్నారని, వారికి ఉత్తరాంధ్రపై ప్రేమ లేదన్నారు. నాన్ లోకల్స్ పక్క రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఏం చేయాలో నిర్ణయించాలని చూస్తున్నారని చెప్పారు. ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వస్తుందంటే వారికి ఏడుపొస్తుందని అన్నారు. అధికారం పోయినందుకు ఏడుస్తారని, వారు చేయనిది మనం చేస్తున్నా కూడా వారికి ఏడుపని సెటైర్లు పేల్చారు జగన్.