గోవిందా, గోవిందా.. జగన్ మాస్ ర్యాగింగ్
"ఒక బిందెడు పన్నీరు తీసుకెళ్లి బూడిదలో పోస్తే ఏమవుతుంది?.. గోవిందా.. గోవిందా.. ఇది తిరుపతిలో స్వామివారికి చెప్పే గోవిందా.. గోవిందా కాదు. చంద్రబాబు మోసానికి ప్రజలు ఎంతలా అతలాకుతలం అయ్యారో చెప్పే గోవిందా.. గోవిందా." అని అన్నారు జగన్.
2014 ఎన్నికలకు ముందు రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు, ఏమైంది..? గోవిందా.. గోవిందా..
డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు. ఏమైంది..? గోవిందా.. గోవిందా..
జాబు రావాలంటే, బాబు రావాలన్నారు. ఏమైంది..? గోవిందా.. గోవిందా..
బాబు అధికారంలో ఉంటే వర్షాలు గోవిందా.. రిజర్వాయర్‌లలో నీళ్లు గోవిందా.
ఓటుకు నోటుకేసులో అడ్డంగా దొరికిపోయి.. మన రాజధాని గోవిందా.
గ్రాఫిక్స్ రాజధాని కూడా గోవిందా.. గోవిందా..
సింగపూర్‌ను మించిన రాజధాని అంటూ విశాఖను గోవిందా..
కేంద్రంతో రాజీ పడి.. ప్రత్యేక హోదా గోవిందా.. గోవిందా.
14 ఏళ్లపాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం అయినా గుర్తొస్తుందా అని తన సభల్లో ప్రజల్ని అడుగుతుంటారు సీఎం జగన్. ఆయన ఇటీవల స్టైల్ మార్చారు. తన మాటలతో, హావభావాలతో చంద్రబాబుని ర్యాగింగ్ చేయడం మొదలు పెట్టారు. బాబుతో పెట్టుకుంటే గోవిందా, గోవిందా.. అంటూ అనకాపల్లి జిల్లా చోడవరంలో నిర్వహించిన సభలో సెటైర్లు పేల్చారు జగన్.
చంద్రబాబుని నమ్మితే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్లే అవుతుంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే వర్షాలు గోవింద, కుర్చీ ఎక్కితే రిజర్వాయర్‌లలో నీళ్లు గోవింద, అతని మాటల్ని నమ్మితే గోవిందా గోవింద. వచ్చే ఎన్నికల్లో మన @YSRCParty అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక… pic.twitter.com/DKVcw2DO0T
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 29, 2024
"ఒక బిందెడు పన్నీరు తీసుకెళ్లి బూడిదలో పోస్తే ఏమవుతుంది?.. గోవిందా.. గోవిందా.. ఇది తిరుపతిలో స్వామివారికి చెప్పే గోవిందా.. గోవిందా కాదు. చంద్రబాబు మోసానికి ప్రజలు ఎంతలా అతలాకుతలం అయ్యారో చెప్పే గోవిందా.. గోవిందా." అని అన్నారు జగన్.
చంద్రముఖి కాదు కొంచ చిలువ..
చంద్రబాబుని చంద్రముఖి, పశుపతితో పోలుస్తూ ఇటీవల సెటైర్లు వేసిన జగన్, తాజాగా ఆయన్ను ఓ కొండ చిలువతో పోల్చారు. చంద్రబాబుని నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టినట్లేనని అన్నారు జగన్. చంద్రబాబుని నమ్మడం అంటే మళ్లీ మోసపోవడమేనని, ఇది చరిత్ర చెబుతున్న సత్యం అని అన్నారు. జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని, పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని వివరించారు. మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని అన్నారు జగన్.