వైసీపీ శ్రేణుల్లో కాన్ఫిడెన్స్ పెంచిన జగన్ ట్వీట్
మనమే మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని కార్యకర్తలకు, నేతలకు మరోసారి భరోసా ఇచ్చారు జగన్.
వైసీపీ ఘన విజయం సాధిస్తుందని, ఫలితాలు చూశాక దేశం మొత్తం ఏపీవైపు చూస్తుందని.. లండన్ పర్యటనకు వెళ్లే ముందు ధీమాగా చెప్పిన సీఎం జగన్ తాజాగా మరో ట్వీట్ తో ఆ కాన్ఫిడెన్స్ ని రెట్టింపు చేశారు. ప్రజలందరి దీవెనలతో మళ్లీ మన ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని చెప్పారు. ఇదే మంచిని కొనసాగిస్తామని కూడా అన్నారాయన.
దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది.
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 30, 2024
ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి… pic.twitter.com/6EOA8CGend
"దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది." అంటూ జగన్ తాజాగా ట్వీట్ చేశారు. 2019లో ప్రభుత్వం ఏర్పాటైన సందర్భాన్ని గుర్తు చేస్తూ, ఈసారి కూడా వైసీపీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు జగన్.
జగన్ లండన్ వెళ్లిన తర్వాత ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చాలానే చోటు చేసుకున్నాయి. వైరి వర్గాలకు వైసీపీ నేతలు ధీటుగానే బదులిస్తున్నా... అధినేత ఇక్కడ లేడనే వెలితి శ్రేణుల్లో ఉందని తెలుస్తోంది. తాజాగా జగన్ ట్వీట్ తో ఆ వెలితి భర్తీ అయింది. మనమే మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని కార్యకర్తలకు, నేతలకు మరోసారి భరోసా ఇచ్చారు జగన్.