ఏపీలో తొలి ఆక్వా యూనివర్శిటీకి సీఎం జగన్ శంకుస్థాపన
ఏపీలో కూడా ఆక్వా యూనివర్శిటీ ఏర్పాటవుతోంది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం వైఎస్ జగన్ ఈ యూనివర్శిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
వ్యవసాయానికి సంబంధించి అన్నిరంగాలకు కలిపి గతంలో ఒకే యూనివర్శిటీ ఉండేది. అయితే ఇప్పుడు వివిధ విభాగాలకు విడివిడిగా యూనివర్శిటీలను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఏపీలో ఆక్వా యూనివర్శిటీ ఏర్పాటు చేశారు. మత్య్స సంపద ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న ఏపీ, ఆక్వా యూనివర్శిటీ ఏర్పాటుతో మరో ముందడుగు వేసింది. ఇప్పటికే కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఇలాంటి విద్యా సంస్థలున్నాయి. ఇప్పుడు ఏపీలో కూడా ఆక్వా యూనివర్శిటీ ఏర్పాటవుతోంది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం వైఎస్ జగన్ ఈ యూనివర్శిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
నరసాపురంలో ఆక్వా యూనివర్శిటీతోపాటు బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బరు నిర్మాణానికి కూడా సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రూ.1,400 కోట్లతో జిల్లా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టుకి కూడా ఆయన కొబ్బరికాయ కొట్టారు. నరసాపురం ప్రాంతీయ వైద్యశాల నూతన భవనాన్ని ప్రారంభించారు.