Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు ఇచ్చింది సున్నా.. జగన్‌ ఇచ్చిన ఇళ్లు, స్థలాలు ఇవీ..

జగన్‌ తన హయాంలో ఇప్పటి వరకు మొదటి దశలో 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే 8.6 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించారు.

చంద్రబాబు ఇచ్చింది సున్నా.. జగన్‌ ఇచ్చిన ఇళ్లు, స్థలాలు ఇవీ..
X

ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ, అనుభ‌వం అని గింజుకునే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల ప‌రిపాల‌నా కాలంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదు. మొద‌టిసారి ముఖ్య‌మంత్రి అయిన జ‌గ‌న్‌.. త‌న పాద‌యాత్ర‌లో సొంతిళ్లు లేని పేద‌ల బాధ‌లు చూశారు.. వారి సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చాల‌నే ధృడ సంక‌ల్పంతో న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు అనే ప‌థ‌కాన్ని తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇప్పటికే 8.6 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ రాష్ట్రవ్యాప్తంగా 71,812 ఎకరాల విస్తీర్ణంలో 31 లక్షల ఇంటి స్థలాలు ఉచితంగా పంపిణీ చేశారు. ఒక్కో ఇంటి స్థలం విలువ ప్రాంతాన్ని బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు పలుకుతుంది.

జగన్‌ తన హయాంలో ఇప్పటి వరకు మొదటి దశలో 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే 8.6 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించారు. మిగిలిన ఇళ్ల నిర్మాణం కూడా శరవేగంగా సాగుతోంది. జగన్‌ ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.70 లక్షల మేర ప్రయోజనం చేకూరుస్తున్నారు. ఒక్కో ఇంటిపై మరో లక్ష రూపాయలకు పైగానే మౌలిక వసతులకు ఖర్చు చేస్తున్నారు.

ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా ఒక్కో ఇంటిపై రూ.15వేలు ప్రయోజనం చేకూరుస్తున్నారు. సిమెంట్‌, స్టీలు, మెటల్‌ ఫ్రేమ్స్‌, ఇతర సామగ్రిని తక్కువ ధరకే అందిస్తున్నారు. తద్వారా ఒక్కో లబ్ధిదారుకు రూ.40 వేల మేర ప్రయోజనం కలుగుతోంది. మరో వైపు పావలా వడ్డీకే రూ.35 వేల చొప్పున బ్యాంకు రుణం కూడా జగన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

వడ్డీ భారం పడకుండా...

బ్యాంకులు 9 నుంచి 11 శాతం వడ్డీతో రుణాలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలపై భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలు ఏర్పాటు చేయడంతో పాటు వడ్డీ భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తోంది. ఇందులో భాగంగా 12.77 లక్షల మందికి రూ.4,500 కోట్ల బ్యాంకు రుణం అందించి అందులో ఈ దఫా అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.46.90 కోట్లను వైఎస్‌ జగన్‌ ఈ ఏడాది జనవరి 18వ తేదీన జమ చేశారు. ఇలా ఏడాదిలో రెండు పర్యాయాలు జగన్‌ ఆ పని చేస్తున్నారు.

ఇళ్ల పట్టాలు, ఇళ్ల ద్వారా ప్రతి పేద మహిళకు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు లబ్ధి చేకూరుస్తున్నారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా పేద మహిళల చేతుల్లో రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల ఆస్తి ఉంటుంది.

First Published:  6 Feb 2024 11:31 AM GMT
Next Story