దటీజ్ జగన్.. కేరాఫ్ క్రెడిబిలిటీ
"ఇవి నేను నెరవేర్చిన హామీలు, ఇవి నేను నెరవేరుస్తానని చెబుతున్న హామీలు.." అంటూ ధైర్యంగా చెప్పారు సీఎం జగన్.
దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయని, చేయలేని సాహసం ఏపీ సీఎం జగన్ చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోని ఓ చేతిలో, ఈ ఎన్నికల్లో ఇస్తున్న మేనిఫెస్టోని మరో చేతిలో పట్టుకుని ప్రజల ముందుకు వచ్చారు. "ఇవి నేను నెరవేర్చిన హామీలు, ఇవి నేను నెరవేరుస్తానని చెబుతున్న హామీలు.." అంటూ ధైర్యంగా చెప్పారు. దటీజ్ సీఎం జగన్ కేరాఫ్ క్రెడిబిలిటీ అంటూ ఆయన్ని ఆకాశానికెత్తేశారు మంత్రి రోజా. చంద్రబాబు ఇలా చేయగలరా అంటూ ఆమె ఛాలెంజ్ చేశారు.
ఛాలెంజ్..
— Roja Selvamani (@RojaSelvamaniRK) April 27, 2024
చంద్రబాబు ఇలా చెయ్యగలరా...?
సీఎం @ysjagan ..2019 @YSRCParty మేనిఫెస్టో ఓ చేత్తో పట్టుకుని..మరో చేత్తో 2024 మేనిఫెస్టో ను ప్రకటించారు
2019 లో ఇచ్చిన హామీల్లో ఏవీ అమలు చేశారో..రాశారు..ఇంకా ఏవి అమలు చేస్తామో రాశారు..
మరి @ncbn కి 2014 @JaiTDP మేనిఫెస్టో ని ఓ చేత్తో… pic.twitter.com/3YMfy1xJlm
సీఎం జగన్ మేనిఫెస్టోలో కొత్త అంశాలు దండిగా ఉంటాయని చాలామంది ఆశించారు. చంద్రబాబు సూపర్ సిక్స్ ని మించిపోయేలా మరిన్ని ఉచితాలు ఉంటాయనుకున్నారు. కానీ ఆయన ఇప్పుడు ఇచ్చిన వాటిని కొనసాగిస్తూ.. మరికొన్నిటిని జతచేశారు. చంద్రబాబుతో పోటీ పడలేదు, ఆ మాటకొస్తే సూపర్ సిక్స్ అనే దాని గురించి జగన్ పెద్దగా ఆలోచించలేదనే చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు హామీలు నీటిమూటలని ప్రజలకు ఆల్రడీ తెలుసు. 2014లో వారికి అది అనుభవంలోని విషయమే. అందుకే జగన్ ధీమాగా తాను చేయబోతున్నది చెప్పారు. చంద్రబాబు లాగా గారడీ చేయలేదు.
కూటమిలో దిగులు..
జగన్ కూడా హామీల విషయంలో తమతో పోటీ పడతారని, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం వంటి హామీలు ఇచ్చేస్తారేమోనని పచ్చ బ్యాచ్ ఎదురు చూసింది. ఓ దశలో ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని ఎన్నికలకు ముందే జగన్ ప్రభుత్వం ప్రారంభిస్తుందని ఎల్లో మీడియా ఊదరగొట్టింది. కానీ జగన్ అలాంటి మోసపు హామీలజోలికి వెళ్లలేదు. ప్రజలకు నిజంగా ఏది అవసరమో అదే చేశారు, అదే కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. ఇది ఒకరకంగా కూటమి నేతలకు షాకింగ్ న్యూసే. జగన్ కూడా పోటీపడి హామీలిచ్చేస్తే టీడీపీ సూపర్ సిక్స్ హామీలు హైలైట్ అయ్యేవి. కానీ జగన్ ఆ పని చేయలేదు. దీంతో ఇక్కడ మేనిఫెస్టో కంటే విశ్వసనీయత అనేది ప్రధాన అంశంగా మారింది.