బస్సు యాత్రపై ఏడుపు మొదలు పెట్టిన ఎల్లో మీడియా
ఆర్టీసీ బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్ని తయారు చేయించి, వాటిని అద్దె ప్రాతిపదికన వైసీపీకి అప్పగిస్తే నష్టమేంటి..? ఆమేరకు ఆర్టీసీకి ఆదాయం లభిస్తుంది కదా..? మరిక్కడ ఎల్లో మీడియా ఏడుపు ఎందుకు..?
సీఎం జగన్ బస్సు యాత్ర మొదలవుతుందనే వార్తల నేపథ్యంలో వైసీపీ కేడర్ లో జోష్ నెలకొంది. బస్సు యాత్రను విజయవంతం చేయడానికి ఎక్కడికక్కడ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు నేతలు. అదే సమయంలో ఎల్లో మీడియా మాత్రం తన అక్కసు వెళ్లగక్కడం మొదలైంది. జగన్ ప్రచారానికి ఆర్టీసీ సంస్థ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను సిద్ధం చేస్తోందని, ప్రజా ధనం దుర్వినియోగం చేస్తోందని కథనాలు వండి వారుస్తోంది. ఎన్నికల కోడ్ అమలులో ఉంది కాబట్టి ఆర్టీసీ వాహనాలను ఉచితంగా ఇవ్వడం అసాధ్యం. కచ్చితంగా అద్దె ప్రాతిపదికనే ఆ ఏర్పాట్లు జరుగుతాయి. అయితే ఎల్లో మీడియా మాత్రం ప్రజా ధనం దుర్వినియోగం అంటూ మొసలి కన్నీరు కారుస్తోంది.
ఎల్లో మీడియా లెక్కల ప్రకారం..
సీఎం జగన్ ఎన్నికల ప్రచారం కోసం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఆర్టీసీ సిద్ధం చేస్తోంది.
పంజాబ్‌లోని అంబాల వద్ద గల జేసీబీఎల్ కంపెనీలో ఈ వాహనాలను ఆర్టీసీ అధికారులు తయారు చేయించారు.
బస్సులో అత్యాధునిక.. విలాసవంతమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
బుల్లెట్ ప్రూఫ్ బస్సు ఒక్కొక్కదాని ఖరీదు రూ.13 కోట్ల రూపాయలు.
మరో మూడు మినీ బస్సులు కూడా సిద్ధమయ్యాయి. వాటి ధర దాదాపు రూ.10కోట్లు.
విజయవాడకు ఒక బుల్లెట్ ప్రూఫ్ బస్సు, 3 మినీ బస్సులు చేరుకున్నాయి.
అయితే ఏంటి..?
ఆర్టీసీ బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్ని తయారు చేయించి, వాటిని అద్దె ప్రాతిపదికన వైసీపీకి అప్పగిస్తే నష్టమేంటి..? ఆమేరకు ఆర్టీసీకి ఆదాయం లభిస్తుంది కదా..? మరిక్కడ ఎల్లో మీడియా ఏడుపు ఎందుకు..? పోనీ ఆ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఏ సంస్థ సమకూర్చినా కూడా ఎల్లో మీడియా ఇంతకంటే తెగ ఇదైపోయి ఉండేది. ఇదే ఉత్సాహం, పవన్ కల్యాణ్ వారాహి విషయంలో ఎందుకు చూపించలేదనేదే అసలు ప్రశ్న. ఏదో ఒక రకంగా జగన్ పై బురదజల్లేందుకే ఎల్లో మీడియా ప్రయత్నిస్తోంది. బస్సుయాత్రపై అక్కసు వెళ్లగక్కుతోంది.