నాకు తండ్రిలాంటి వారు.. నేను అన్నా అంటుంటా
"నాకు తండ్రిలాంటి వారు.. నేను అన్నా అంటుంటా" అని మంత్రి బొత్స గురించి స్టేజ్ పై మాట్లాడారు జగన్.
మేమంతా సిద్ధం బస్సుయాత్రలో పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా సభలలో పాల్గొంటున్నారు సీఎం జగన్. అదే వేదికపై అభ్యర్థులను ప్రకటిస్తూ వారి మంచితనం గురించి చెబుతున్నారు, వారితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇలాంటి వీడియోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. సౌమ్యులు, మంచివారు అంటూ వారి గురించి జగన్ చెబుతున్న వీడియోలను కొన్నిసార్లు ప్రతిపక్షాలు కూడా ట్రోల్ చేస్తున్నాయి. తాజాగా మంత్రి బొత్స గురించి సీఎం జగన్ చెప్పిన మాటలు, దానికి ఆయన రియాక్షన్ వైరల్ గా మారింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది.
జననేతను మరోమారు ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు చీపురుపల్లి, విజయనగరం జిల్లా సిద్ధం. #TeamBotcha #MemanthaSiddham #APWithJagan #VoteForFan pic.twitter.com/MKXhO7oocU
— Botcha Satyanarayana (@BotchaBSN) April 23, 2024
"నాకు తండ్రిలాంటి వారు.. నేను అన్నా అంటుంటా" అని మంత్రి బొత్స గురించి స్టేజ్ పై మాట్లాడారు జగన్. అలా మాట్లాడుతున్నంత సేపు బొత్స కూడా జగన్ చేయి పట్టుకుని ఉన్నారు, తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో ఆయన్ను చూసిన అందరూ.. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉన్నారు. వైఎస్సార్సీపీ ఏర్పడిన వెంటనే ఆయన ఆ పార్టీలోకి వెళ్లలేకపోయినా ఆ తర్వాత ఉత్తరాంధ్రలో కీలక నేతగా వైసీపీని బలోపేతం చేశారు. తన మంత్రి వర్గంలో రెండుసార్లు బొత్సకు అవకాశమిచ్చారు జగన్. ఈసారి బొత్స సతీమణి ఝాన్సీకి కీలకమైన విశాఖ లోక్ సభ స్థానం ఇచ్చారు. ఇలా జగన్, బొత్స కుటుంబాల మధ్య అనుబంధం మరింత పెరిగింది. ఆ అభిమానంతోనే బొత్స తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.