Telugu Global
Andhra Pradesh

చింతమనేని ప్రభాకర్‌పై సీఎం చంద్రబాబు ఆగ్రహం

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు

చింతమనేని ప్రభాకర్‌పై సీఎం చంద్రబాబు ఆగ్రహం
X

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు డ్త్రెవర్‌ను తాను దూషిస్తూ దురుసుగా ప్రవర్తించిన ఘటనపై చింతమనేని ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చారు. ఇష్ట్రమొచ్చినట్లు మాట్లడాటం తిట్టడం వంటి పనులతో పార్టీ, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని సీఎంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి జరగకుండా చూసుకోవాలని సహనంతో ఉండాలని చంద్రబాబు సూచించారు.భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి' అని చంద్రబాబు చింతమనేని ప్రభాకర్‌కు వార్నింగ్ ఇచ్చారు.

అయితే.. ఈ ఘటనపై ప్రభాకర్ మీడియా ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన కారు వెళ్లడానికి వీల్లేకుండా వారు వాహనాన్ని అడ్డు పెట్టారని చెప్పారు. ఇటీవల చింతమనేని ప్రభాకర్ ఓ శుభకార్యానికి వెళ్లారు. ఆయన వెళ్లడానికంటే ముందే.. తన రాజకీయ ప్రత్యర్థి అబ్బయ్య చౌదరి అక్కడ ఉన్నారు. అయితే.. ఫంక్షన్ హాల్‌కు వెళ్లే దారిలో అబ్బయ్య చౌదరి కారు ఉంది. తన కారు వెళ్లడానికి దారి ఇవ్వలేదంటూ.. చింతమనేని ప్రభాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు దిగి వచ్చి డ్రైవర్‌ను చెప్పలేని బూతులు తిట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

First Published:  15 Feb 2025 4:20 PM IST
Next Story