Telugu Global
Andhra Pradesh

నన్నే పాస్‌ అడుగుతావా? - పోలీసులతో సబ్‌ కలెక్టర్ వాగ్వాదం

ఆలయంలోకి వెళ్లేందుకు సబ్ కలెక్టర్ మోహన్‌ రాగానే పోలీసులు అడ్డుకున్నారు. దాంతో నన్నే అడ్డుకుంటారా అని పోలీసులపై ఫైర్ అయ్యారు. సబ్‌ కలెక్టర్‌ను కూడా గుర్తు పట్టలేరా అంటూ పోలీసులను ఆయన ప్రశ్నించారు.

నన్నే పాస్‌ అడుగుతావా? - పోలీసులతో సబ్‌ కలెక్టర్ వాగ్వాదం
X

ఇంద్రకీలాద్రిపై అధికారుల కీచులాటలు ఆగడం లేదు. తాజాగా పోలీసులకు, ఇన్‌చార్జ్ సబ్‌ కలెక్టర్‌కు మధ్య భక్తుల సమక్షంలోనే వాగ్వాదం జరిగింది. పోలీసులపై సబ్‌ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఐడీ కార్టు లేకుంటే తామెలా గుర్తుపట్టేది అంటూ పోలీసులూ అంతే తీవ్రంగా స్పందించారు.

ఆలయంలోకి వెళ్లేందుకు సబ్ కలెక్టర్ మోహన్‌ రాగానే పోలీసులు అడ్డుకున్నారు. దాంతో నన్నే అడ్డుకుంటారా అని పోలీసులపై ఫైర్ అయ్యారు. సబ్‌ కలెక్టర్‌ను కూడా గుర్తు పట్టలేరా అంటూ పోలీసులను ఆయన ప్రశ్నించారు. గుడికి చాలా మంది వస్తున్నారని.. ఐడీ కార్డులు లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా నేరుగా వస్తే తామెలా గుర్తుపట్టాలని పోలీసులు ప్రశ్నించారు. ఆ తర్వాత సీఐ జోక్యం చేసుకుని సబ్ కలెక్టర్‌కు సర్దిచెప్పారు.


అటు పాసుల విషయంలోనూ వివాదం తలెత్తింది. ఒకరి పాస్‌తో మరొకరు వస్తున్నట్టుగా ఈవో గుర్తించారు. దీంతో వారి పాసులను లాగేసుకుని వెనక్కుపంపించారు. కొందరు సిబ్బంది తమ పాస్‌లను, ఐడీ కార్డులను కుటుంబసభ్యులకు ఇచ్చి పంపించారు. కొందరు కేవలం మెడలో ఏదో ఒక ఐడీ కార్డు ఉంటే ఆపే వారు ఉండరన్న ఉద్దేశంతో ఫేక్ ఐడీ కార్డులనూ ధరించి వచ్చారు. వాటిని తీసుకుని వారిని వెనక్కు పంపించారు ఈవో.

First Published:  29 Sept 2022 3:43 PM IST
Next Story