Telugu Global
Andhra Pradesh

సినిమా స్టైల్ లో యాక్సిడెంట్.. బొలెరోని ఢీకొన్న దురంతో ఎక్స్ ప్రెస్

ఇంతలో రైలు వచ్చేసింది. ఏం చేయాలో తెలియక కారులోనివారంతా దిగి పరుగులు తీశారు. రైలు, కారుని ఢీకొని 100 మీటర్లు ఈడ్చుకెళ్లింది. ఇంజిన్ దెబ్బతినడంతో రైలు అక్కడే ఆగిపోయింది.

సినిమా స్టైల్ లో యాక్సిడెంట్.. బొలెరోని ఢీకొన్న దురంతో ఎక్స్ ప్రెస్
X

ఏపీలో సినిమా స్టైల్ లో ఓ యాక్సిడెంట్ జరిగింది. ఏలూరు జిల్లా భీమడోలు వద్ద రైల్వే క్రాసింగ్ దగ్గర ఈ ఘటన జరిగింది. అటు ఇటు వాహనాలను ఆపేసిన ప్రయాణికులు ఈ యాక్సిడెంట్ ని లైవ్ లో చూసి షాకయ్యారు. పట్టాలమీద ఉన్న బొలెరో వాహనాన్ని దురంతో ఎక్స్ ప్రెస్ ఢీకొంది. దీంతో ఆ వాహనం తుక్కు తుక్కుగా మారింది. రైలు కొంతదూరం వెళ్లి ఆగిపోయింది. రైలింజన్ దెబ్బతినడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

ట్రాక్ పైకి కారెలా వచ్చింది..?

దురంతో ఎక్స్‌ ప్రెస్‌ కి సిగ్నల్ ఇవ్వడంతో భీమడోలు జంక్షన్‌ వద్ద గేటు వేశారు రైల్వే సిబ్బంది. దీంతో అటు ఇటు వాహనాలు ఆగిపోయాయి. కానీ ఓ బొలెరో మాత్రం గేటు వేసినా దూసుకెళ్లాలని చూసింది. రైలు సిబ్బంది ససేమిరా అనడంతో రైల్వే గేటుని కారుతో ఢీకొట్టారు. సరిగ్గా ట్రాక్ పైకి వచ్చేసరికి బొలెరో ఆగిపోయింది. ఇంతలో రైలు వచ్చేసింది. ఏం చేయాలో తెలియక కారులోనివారంతా దిగి పరుగులు తీశారు. రైలు కారుని ఢీకొని 100 మీటర్లు ఈడ్చుకెళ్లింది. ఇంజిన్ దెబ్బతినడంతో రైలు అక్కడే ఆగిపోయింది.

రైలు ఢీకొన్న సమయంలో బొలెరో వాహనంలోనివారు అందులోనే ఉండి ఉంటే అక్కడికక్కడే చనిపోయేవారు. అదృష్టవశాత్తు వారంతా కారు దిగి పారిపోయారు. ఈలోగా రైలు ఆ వాహనాన్ని ఢీకొంది. సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు కామన్ గా కనపగడుతుంటాయి. యాక్షన్ సీన్స్ లో రైలు కారుని ఢీకొనడం వంటి సన్నివేశాలు తెలుగు సినిమాల్లో కోకొల్లలు. కానీ రియల్ లైఫ్ లో ఈ యాక్షన్ సీన్ ని రియల్ గానే చూశారు ఏలూరు వాసులు. అసలు ఆ కారుని వదిలేసి పారిపోయినవారు ఎవరు..? అంత అర్జంట్ గా వారు రైల్వే ట్రాక్ ఎందుకు దాటాలని చూశారు, వారిప్పుడు ఎక్కడున్నారు..? ఈ విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

First Published:  30 March 2023 12:51 PM IST
Next Story