నారాయణ కుమార్తె ఇంట్లో సీఐడీ సోదాలు
దీనిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీ.. నారాయణ రెండో కుమార్తె శరణి కూడా ఇదే తరహాలో 146 ఎకరాల భూముల కొనుగోలు చేసినట్టు గుర్తించింది.
మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబ సభ్యులను అమరావతి భూముల వ్యవహారం వెంటాడుతోంది. హైదరాబాద్ మాదాపూర్‌లోని నారాయణ రెండో కుమార్తె శరణి నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహించింది. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో పక్కా సమాచారం ఆధారంగానే సోదాలు నిర్వహిస్తున్నట్టు సీఐడీ ప్రకటించింది.
నాడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ.. అమరావతి భూముల వ్యవహారాన్ని పర్యవేక్షించారు. ఆ సమయంలో బినామీల పేరుతో వందల ఎకరాలను నారాయణ కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం అసైన్డ్ భూములను వెనుక్కు తీసుకుంటుందని.. ఎలాంటి పరిహారం ఇవ్వదని తొలుత అసైన్డ్ రైతులను బెదరగొట్టి వారి నుంచి తక్కువ ధరకు అనైన్డ్ భూములను సొంతం చేసుకున్నట్టు అభియోగం.
అలా వందల ఎకరాల అసైన్డ్ భూములు తన చేతుల్లోకి రాగానే నారాయణ చక్రం తిప్పి ఆ భూములకూ ప్యాకేజ్ ప్రకటించేలా జీవో తెచ్చారు. దాంతో నిజమైన అసైన్డ్ రైతులు భారీగా నష్టపోయారు. అసైన్డ్ భూములు కొనడం నేరమని తెలిసినా టీడీపీ నేతలు ముందుకెళ్లారు.
దీనిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీ.. నారాయణ రెండో కుమార్తె శరణి కూడా ఇదే తరహాలో 146 ఎకరాల భూముల కొనుగోలు చేసినట్టు గుర్తించింది. మనీ రూటింగ్‌ను నిర్ధారించిన అధికారులు ఆమె నివాహంలో సోదాలు చేశారు.