A1-చంద్రబాబు, A2- లోకేష్.. ఫేక్ ప్రచారంపై సీఐడీ కేసు
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై IVR కాల్స్‌తో తెలుగుదేశం పార్టీ ఓటర్లను తప్పుదోవ పట్టిస్తోందని వైసీపీ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శనివారం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌లకు షాక్ ఇచ్చింది ఏపీ సీఐడీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఫేక్ ప్రచారం చేస్తున్నారన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది. FIRలో A1గా చంద్రబాబు నాయుడు, A2గా నారా లోకేష్ పేర్లను చేర్చింది. వీరితో పాటు మరో 10 మందిపై కేసు నమోదు చేసింది. IVR కాల్స్ చేసిన ఏజెన్సీపైనా కేసు నమోదు చేసింది.
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై IVR కాల్స్‌తో తెలుగుదేశం పార్టీ ఓటర్లను తప్పుదోవ పట్టిస్తోందని వైసీపీ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శనివారం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూములు లాక్కొబోతున్నారని, జగన్‌కు ఓటు వేయొద్దంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విష్ణు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాల్‌లో చెప్పే విషయాలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినట్లు విష్ణు ఎన్నికల సంఘానికి నివేదించారు. వెంటనే IVR కాల్స్‌ను పరిగణలోకి తీసుకుని.. తప్పుడు ప్రచారాన్ని నిలిపివేసేలా టీడీపీని ఆదేశాలించాలని విష్ణు కోరారు. టెలికాం ఆపరేటర్ల నుంచి వివరణ కోరాలన్నారు.
CID of AP books case against Chandra Babu Naidu for alleged “Fake “ Campaign on Land Titling Act following the order of Election authorities
— Sudhakar Udumula (@sudhakarudumula) May 5, 2024
The Crime Investigation Department (CID) of the Andhra Pradesh police has filed a criminal case against TDP chief N Chandrababu Naidu,… pic.twitter.com/adVS3vYrjS
ఎన్నికల సంఘం ఆదేశాలతో మంగళగిరిలోని సీఐడీ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆడియో ఫైల్స్‌తో కూడిన పెన్‌డ్రైవ్ సహా ఇతర ఆధారాలను సీఐడీ అధికారులు సేకరించారు.