చంద్రబాబుకు వ్యతిరేకంగా కొత్త సాక్ష్యం
చంద్రబాబు లాయర్ ఊహించని విధంగా గట్టి సాక్ష్యాన్ని సీఐడీ జడ్జికి అందించింది. ఇంతకీ ఆ సాక్ష్యం ఏమిటంటే స్కిల్ స్కామ్‌లో దోచుకున్న రూ.247 కోట్లలో రూ.27 కోట్లు తెలుగుదేశం పార్టీ ఖాతాకు చేరినట్లు సీఐడీ లాయర్ చెప్పారు.
స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు పాత్రను నిరూపించేందుకు సీఐడీ కొత్త డాక్యుమెంటరీ సాక్ష్యాన్ని ప్రవేశపెట్టింది. సీఐడీ ప్రవేశపెట్టిన ఎవిడెన్స్ తో చంద్రబాబు పీకల్లోతు కూరుకుపోయినట్లేనా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. స్కామ్‌లో చంద్రబాబు పాత్రను నిరూపించేందుకు సీఐడీ ఇప్పటివరకు ప్రవేశపెట్టిన ఆధారాలు ఒక ఎత్తు, ఇప్పుడు ప్రవేశపెట్టిన ఆధారం మరో ఎత్తుగా సీఐడీ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంది. స్కిల్ స్కామ్‌లో మరిన్ని వివరాలు రాబట్టాలి కాబట్టి కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అడిగింది. సీఐడి లాయర్ వాదనతో ఏకీభవించిన కోర్టు 14 రోజులు రిమాండు పొడిగించింది. ఇదే సమయంలో చంద్రబాబుకు స్కామ్‌తో సంబంధంలేదు కాబట్టి బెయిల్ ఇవ్వాలన్న చంద్రబాబు లాయర్ వాదనను పట్టించుకోలేదు.
అయితే చంద్రబాబు లాయర్ ఊహించని విధంగా గట్టి సాక్ష్యాన్ని సీఐడీ జడ్జికి అందించింది. ఇంతకీ ఆ సాక్ష్యం ఏమిటంటే స్కిల్ స్కామ్‌లో దోచుకున్న రూ.247 కోట్లలో రూ.27 కోట్లు తెలుగుదేశం పార్టీ ఖాతాకు చేరినట్లు సీఐడీ లాయర్ చెప్పారు. తన వాదనకు మద్దతుగా సీఐడీ లాయర్ పార్టీ బ్యాంకు ఖాతా వివరాలను జడ్జికి అందించారు. నోట్ ఫైల్స్‌లో 13 చోట్ల చంద్రబాబు సంతకాలు చేయటం పాత సాక్ష్యమనే చెప్పాలి. అలాగే జీవోల్లోని అంశాలు, ఒప్పందంలోని అంశాలకు చాలా తేడా ఉన్న విషయాన్ని కూడా ఇప్పటికే సీఐడీ జడ్జికి అందించింది.
పార్టీ బ్యాంకు ఖాతాలోకి రూ. 27 కోట్లు ఎలా వచ్చిందనే విషయంపై చంద్రబాబును విచారించాలని సీఐడీ లాయర్ చెప్పారు. ఇదే విషయమై పార్టీ ఆడిటర్‌ను కూడా ఈ నెల 10న విచారించబోతున్నట్లు చెప్పారు. స్కిల్ స్కామ్‌లో దోచుకున్న నిధులను ఇంకా ఎక్కడెక్కడికి తరలించారన్న విషయాలను చంద్రబాబు నుండే రాబట్టాలని లాయర్ వివరించారు.
కాబట్టి ఈ దశలో చంద్రబాబుకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇచ్చేందుకు లేదని సీఐడీ తరపున వాదించిన అడిషినల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి గట్టిగా చెప్పారు. బ్యాంకు ఖాతాల వివరాలను సాక్ష్యాలుగా సీఐడీ చూపిస్తుందని బహుశా చంద్రబాబు లాయర్ ఊహించినట్లు లేరు. అందుకనే చంద్రబాబు అరెస్టు సాంకేతికంగా తప్పంటు వాదనకు దిగారు. అసలు తప్పు జరగలేదని, ఒకవేళ తప్పు జరిగినా అందులో చంద్రబాబుకు సంబంధంలేదని వాదించటమే విచిత్రంగా ఉంది.
♦