Telugu Global
Andhra Pradesh

Taraka Ratna: నందమూరి అభిమానులకు ఊరటనిచ్చిన చిరంజీవి ట్వీట్..

Taraka Ratna: తారకరత్న ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి నందమూరి కుటుంబ సభ్యులు చిరంజీవికి సమాచారం ఇచ్చి ఉంటారని తెలుస్తోంది. అందుకే చిరంజీవి, తారకరత్న ఆరోగ్యంపై పూర్తి పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు.

Taraka Ratna: నందమూరి అభిమానులకు ఊరటనిచ్చిన చిరంజీవి ట్వీట్..
X

బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఏ చిన్న సమాచారం వచ్చినా సోషల్ మీడియాలో అది హాట్ టాపిక్ గా మారుతోంది. ఆయన పరిస్థితి విషమం, మరీ విషమం అనే వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే ఇటీవల నందమూరి రామకృష్ణ మాటల తర్వాత తారకరత్న అభిమానులకు కాస్తంత ధైర్యం వచ్చింది. ఆయన కోలుకుంటున్నారని చెప్పారు రామకృష్ణ. అయితే వైద్యులు మాత్రం గుంభనంగా ఉన్నారు. ఈ దశలో మెగాస్టార్ చిరంజీవి తనకు తెలిసిన సమాచారం మేరకు తారకరత్న ఆరోగ్యంపై ట్వీట్ చేశారు. ఆయన కోలుకుంటున్నారన్న వార్త తనకు ఉపశమనం ఇచ్చిందన్నారు చిరంజీవి.

"సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు,ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ, ఆ పరిస్థితి నుండి కాపాడిన డాక్టర్లకి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు." అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.


వెంటిలేటర్ పైనే తారకరత్న..

హెల్త్ బులిటెన్ లో డాక్టర్లు తెలియపరిచే విషయాలకంటే, వారి కుటుంబ సభ్యులకు మరింత సమాచారం వైద్యులు అందజేస్తుంటారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తుంటారు. ఈ క్రమంలో చిరంజీవికి తారకరత్న ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి నందమూరి కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చి ఉంటారని తెలుస్తోంది. అందుకే చిరంజీవి, తారకరత్న ఆరోగ్యంపై పూర్తి పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. దీంతో నందమూరి అభిమానులు కాస్త కుదుటపడ్డారు. బెంగళూరు ఆస్పత్రిలో తారకరత్నను చేర్పించిన తర్వాత విషమం, మరీ విషమం అనే వార్తలే వస్తున్నాయి. ఈ దశలో చిరంజీవి వేసిన ట్వీట్ కాస్త ఆశాజనకంగా ఉంది. తారకరత్నను పరామర్శించి వచ్చిన తర్వాత ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ చాలా దిగులుగా కనిపించారు. ఆ తర్వాత నందమూరి రామకృష్ణ మాత్రం తారకరత్న ఎక్మోపై ఉన్నారనే వార్తల్ని ఖండించారు. ఆయన్ను వెంటిలేటర్ పై మాత్రమే పెట్టారని, కోలుకుంటున్నారని చెప్పారు. మంగళవారం నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులు రెండోసారి తారకరత్న హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈరోజు లేదా రేపు మరోసారి ఆస్పత్రి వర్గాలనుంచి అధికారిక సమాచారం బయటకొచ్చే అవకాశాలున్నాయి.

First Published:  31 Jan 2023 11:20 AM IST
Next Story