దాడి ఏపీపై... కేసులు తెలంగాణలో...
ఏపీ సీఐడీ అధికారులను బెదిరించే పనిని టీడీపీ మొదలుపెట్టింది. సీఐడీ అధికారులపై చింతకాయల విజయ్ డ్రైవర్ చేత పోలీసులకు ఫిర్యాదు చేయించారు. తనను కులం పేరుతో దూషించారంటూ డ్రైవర్ విజయ్‌చంద్రబాబు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఓటుకు నోటు కేసు సమయంలో నీకు ఏసీబీ ఉంటే.. నాకూ ఏపీలో ఏసీబీ ఉందంటూ విజయవాడలో ఏకంగా తెలంగాణ సీఎంపై కేసు కూడా పెట్టిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వంపై తెలంగాణలో కేసులు పెట్టే పని మొదలుపెట్టారు. వైఎస్ భారతిపై అనుచితమైన ప్రచారం చేశారన్న అభియోగంపై చింతకాయల విజయ్‌కు నోటీసులు ఇచ్చేందుకు ఏపీ సీఐడీ పోలీసులు ఇటీవల హైదరాబాద్‌కు వచ్చారు. ఆ సమయంలో చింతకాయల విజయ్ తప్పించుకుని పారిపోయారు. సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చేసి వచ్చారు.
ఈ నెల 6న సీఐడీ ముందు హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశించిన నేపథ్యంలో సీఐడీ అధికారులను బెదిరించే పనిని టీడీపీ మొదలుపెట్టింది. ఏపీ సీఐడీ అధికారులపై చింతకాయల విజయ్ డ్రైవర్ చేత పోలీసులకు ఫిర్యాదు చేయించారు. సీఐడీ అధికారులు తనను కులం పేరుతో దూషించారంటూ డ్రైవర్ విజయ్‌చంద్రబాబు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. తన సెల్‌ఫోన్ లాక్కుని దాడి చేశారని ఆరోపించాడు. అయితే కేసు నమోదు చేసేందుకు బంజారాహిల్స్ పోలీసులు నిరాకరించారు. ఇప్పటికే ఈ అంశంపై ఫిర్యాదు పరిశీలనలో ఉందని పోలీసులు చెప్పి పంపించారు.
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంపై సోషల్ మీడియా ద్వారా దాడి చేసే కీలక వ్యక్తులు హైదరాబాద్‌ను బేస్ చేసుకున్నారు. అక్కడ ఉంటే ఏపీ పోలీసులకు అంత ఈజీగా పట్టుబడబోమన్న ఆలోచనతో అక్కడ ఉంటున్నారు. ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్‌కు వెళ్లి చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్ననేపథ్యంలో.. సీఐడీ అధికారులను ఆత్మరక్షణలోకి నెట్టేలా అట్రాసిటీ కేసులు పెట్టడం, ప్రైవేట్ కేసులు వేయడం వంటి చర్యలకు టీడీపీ ప్లాన్ చేస్తోంది.