Telugu Global
Andhra Pradesh

వినాయకచవితి 18నే .. కాణిపాకం ఆలయం ప్రకటన

భాద్రపద శుద్ధ చవితి తేదీ 18-9-2023 సోమవారం ఉదయం 10.15 నిమిషాలు నుంచి మరుసటి రోజు ఉదయం 10.43 నిమిషాలు వరుకూ ఉంటుంది.

వినాయకచవితి 18నే .. కాణిపాకం ఆలయం ప్రకటన
X

అధిక శ్రావణమాసం రావడంతో ఈ ఏడాది పండగలన్నీ లేట్ అవుతున్నాయి. దానికి తోడు తిథులు అటూ ఇటూ అవుతుండటంతో పండగ ఏరోజు అనే సందిగ్దత ఏర్పడుతోంది. ఈ నెలలో రాబోతున్న వినాయక చవితి విషయంలోనూ ఇదే సందేహం. ఈనెల 18వ తేదీన వినాయక చవితి నిర్వహించుకోవాలని కొందరు.. లేదు లేదు 19వ తేదీయే కరెక్ట్ అంటున్నారు మరికొందరు. అయితే, వినాయక చవితి పండగ జరుపుకునే తేదీపై క్లారిటీ ఇచ్చారు కాణిపాకం ఆలయం అర్చకులు. ఈనెల 18వ తేదీన వినాయకచవితి నిర్వహించుకోవాలని తేల్చి చెప్పారు.

ఆరోజు నుంచే బ్రహ్మోత్సవాలు

భాద్రపద శుద్ధ చవితి తేదీ 18-9-2023 సోమవారం ఉదయం 10.15 నిమిషాలు నుంచి మరుసటి రోజు ఉదయం 10.43 నిమిషాలు వరుకూ ఉంటుంది.. అంటే 18-9-2023 రోజు రాత్రి మాత్రమే చవితి తిథి ఉంది. కాబట్టి కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం ప్రధాన వేద పండితులు సుబ్బారావు శర్మ చెప్పారు. 18వ తేదీ నుంచి 21 రోజుల పాటు కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు.

తెలంగాణలోనూ పాటిస్తారా..?

తెలంగాణలోనూ 18వ తేదీనే గణేష్ ఉత్సవాలు ప్రారంభించాలని తెలంగాణ విద్వత్సభ ప్రకటించింది. అయితే 19 నుంచి ఉత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని భాగ్య‌న‌గ‌ర్ ఉత్స‌వ క‌మిటీ చెప్పింది. ఈ రెండింటిలో తెలంగాణ ప్రభుత్వం ఏది ఫైనల్ చేస్తుందో ఇంకా క్లారిటీ రాలేదు.

First Published:  5 Sept 2023 3:16 PM IST
Next Story