టీచర్లను సైతం రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నం: సీఎం జగన్
ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమకు లేదని, విద్యార్థులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర గురువులదేనని సీఎం జగన్ అన్నారు.
టీచర్లను సైతం రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎల్లో మీడియా కూడా రెచ్చగొట్టేలా కుట్రలు చేస్తోందన్నారు. విజయవాడలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థులు మంచి చదువులు చదవాలనేదే సంస్కరణల లక్ష్యమన్నారు. అని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉండేలా మార్పుల దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందిండచమే కాకుండా మోనులో మార్పులు చేశామన్నారు. టీచర్లు తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఎవరూ అడక్కపోయినా టీచర్ల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాం. ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోట్ చేశాం. ఉద్యోగుల పెన్షన్ల విషయంలోనూ చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు. ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమకు లేదన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర గురువులదేనని సీఎం జగన్ అన్నారు.