Telugu Global
Andhra Pradesh

ఆ పదవి కాపులకు ఇవ్వలేరా..? జగన్ కు చేగొండి లేఖాస్త్రం

కాపు కులస్తుల అవసరం మీకు ఉందని రుజువు చేసుకోవాలన్నా, కాపుల పట్ల సానుభూతి ఉన్నా.. టీటీడీ చైర్మన్ పదవిని వారికి ఇవ్వాలని తన లేఖలో సీఎం జగన్ ని కోరారు చేగొండి.

ఆ పదవి కాపులకు ఇవ్వలేరా..? జగన్ కు చేగొండి లేఖాస్త్రం
X

టీటీడీ చైర్మన్ పదవి మరోసారి ఏపీలో రాజకీయాలకు వేదికగా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డిని నియమించారు. రెండోసారి కూడా ఆయనకు పదవి కొనసాగించారు. ఇప్పుడు మాత్రం ఆ పదవి కాపులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య.

లేఖాస్త్రం..

గతంలో పలుమార్లు సీఎం జగన్ కి లేఖాస్త్రాలు సంధించిన చేగొండి హరిరామ జోగయ్య.. తాజాగా టీటీడీ చైర్మన్ పదవి గురించి మరో లేఖ రాశారు. ఆ లేఖలో కాపులకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించారు. సీఎంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు.. కాపులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు చేగొండి. మాజీ సీఎం నీలం సంజీవరెడ్డి దగ్గరనుంచి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా కాపులకు న్యాయం చేయలేదని, కాపులను రాజకీయంగా వాడుకున్నారని ఆరోపించారు.

కాపు కులస్తుల అవసరం మీకు ఉందని రుజువు చేసుకోవాలన్నా, కాపుల పట్ల సానుభూతి ఉన్నా.. టీటీడీ చైర్మన్ పదవిని వారికి ఇవ్వాలని తన లేఖలో కోరారు చేగొండి. రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ ఒంటరి కులస్తులు 22 శాతం మంది ఉన్నారని గుర్తుచేశారు. మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి దగ్గర నుండి ఇప్పటి వరకు ఉన్న అందరు ముఖ్యమంత్రులు కాపులను వాడుకోవడం తప్ప వారికి చేసిందేమీ లేదని విమర్శించారు. కాపుల రిజర్వేషన్ విషయంలో కూడా ఏ రెడ్డి ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేయలేదన్నారు. చివరకు వైఎస్సార్ కు అవకాశం ఉండి కూడా కాపులకు రిజర్వేషన్ కల్పించలేదని ఆరోపించారు. కనీసం జగన్.. టీడీపీ చైర్మన్ పదవిని కాపులకు ఇవ్వాలని కోరారు.

First Published:  25 July 2023 12:52 PM IST
Next Story