Telugu Global
Andhra Pradesh

పిచ్చి బాగా ముదిరిపోయిందా?

రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే విషయంలో చంద్రబాబుకే నమ్మకం కలగటంలేదు. అలాంటిది ఎల్లో మీడియా ఛానల్ యాంకర్ పదే పదే చంద్రబాబు అధికారంలోకి వచ్చేసినట్లే అని చెప్పటమే విచిత్రంగా ఉంది.

పిచ్చి బాగా ముదిరిపోయిందా?
X

చంద్రయాన్-3 సక్సెస్ అయ్యింది. ఈ సక్సెస్‌ను దేశమంతా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఎందుకంటే చంద్రయాన్ సక్సెస్‌కు కొంతమంది సైంటిస్టులే కారణం కావచ్చు. కానీ దాని సక్సెస్ తాలూకు సంతోషాన్ని యావత్ దేశం షేర్ చేసుకుంటోంది. ఇక్కడే ఎల్లో మీడియా పైత్యమంతా బయటపడుతోంది. చంద్రయాన్ సక్సెస్‌కు.. తెలుగుదేశం పార్టీ సక్సెస్‌కు ముడిపెట్టేసింది. చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యిందంటే చంద్రబాబునాయుడు కూడా సక్సెస్ అయిపోయినట్లేనట. ఏపీలో కూడా చంద్రయానమే..చంద్రోదయమే..చంద్రమే అని యాంకర్ చెప్పారు.

అసలు చంద్రయాన్ 3 సక్సెస్‌కు చంద్రబాబుకు ఏమన్నా సంబంధముందా? చంద్రయాన్ 3 సక్సెస్ అయితే టీడీపీ ఎలా సక్సెస్ అవుతుంది? అనే కామన్ సెన్స్ కూడా పోయినట్లుంది. విచిత్రం ఏమిటంటే ఈ వాదనను తెలుగుదేశం పార్టీ నేతలు మొదలుపెట్టలేదు. ఎల్లో మీడియాలోని ఒక ఛానల్ యాంకర్ మొదలుపెట్టారు. చంద్రయాన్ సక్సెస్ అయినట్లే చంద్రబాబు కూడా సక్సెస్ అయిపోతారని అందరూ అనుకుంటున్నారట. చంద్రయాన్‌లో చంద్ర ఉంది చంద్రబాబులో చంద్ర ఉంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో సక్సెస్ అయిపోయినట్లేనట.

చంద్రయాన్ సక్సెస్ అయిన దగ్గర నుండి చంద్రబాబు సక్సెస్ గురించి విపరీతమైన ఫోన్లు వస్తున్నాయట వాళ్ళ ఛానల్‌కు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు సక్సెస్ గురించి మొబైల్ ఫోన్లలో మెసేజ్‌లు తెగ సర్క్యులేట్ అవుతున్నాయని చెప్పిందే చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో బిట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. చంద్రయాన్ సక్సెస్‌కు టీడీపీ అధికారంలోకి రావటానికి ఏమన్నా సంబంధం ఉందా? అసలీ లాజిక్‌ను జనాలు ఆలోచిస్తారనే ఇంగితం కూడా యాంకర్‌లో లోపించటమే ఆశ్చర్యంగా ఉంది.

దీంతోనే ఎల్లో మీడియాలోని ఛానల్ యాంకర్ పిచ్చి ఏ స్థాయిలో ముదిరిపోయిందో జనాలు లెక్క కడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే విషయంలో చంద్రబాబుకే నమ్మకం కలగటంలేదు. అలాంటిది ఎల్లో మీడియా ఛానల్ యాంకర్ పదే పదే చంద్రబాబు అధికారంలోకి వచ్చేసినట్లే అని చెప్పటమే విచిత్రంగా ఉంది. ఇదే పద్ధ‌తి మరికొంతకాలం కంటిన్యూ అయితే ఎన్నికలతో సంబంధం లేకుండానే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయారనే ప్రచారాన్ని కూడా మొదలుపెట్టేస్తారేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో తెగ సెటైర్లు కూడా పేలుతున్నాయి.


First Published:  25 Aug 2023 4:57 AM GMT
Next Story