ఎన్డీయే పాత మిత్రులందర్నీ పిలుస్తోందట.. బాబు మీడియా కవరింగ్
నిన్న చంద్రబాబు అమిత్ షాను కలవడానికి వెళ్లారు. అంతకు కొన్ని రోజుల ముందే టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహనరావు అమిత్ షాను కలిసి మాట్లాడి వచ్చారు.
వైసీపీని ఢీకొట్టాలంటే బీజేపీ కూడా కలిసివస్తే గానీ సాధ్యం కాదని చంద్రబాబు గుర్తించబట్టే జాతీయ పార్టీతో పొత్తుకు తహతహలాడుతున్నాడు. అందుకోసం నిన్న ఢిల్లీకి వెళ్లారు. అయితే అలాగే ఒప్పుకుంటే చంద్రబాబు గొప్పతనం తగ్గిపోదూ! అందుకే ఆయన అనుకూల మీడియాలో కొత్త కథ మొదలుపెట్టారు. ఎన్డీయే తన పాత భాగస్వాములందర్నీ దగ్గరకు తీస్తోందని, ఆ క్రమంలోనే నితీష్ కుమార్‌ను, ఇప్పుడు చంద్రబాబును కూడా పిలిచారని చెప్పుకొచ్చింది.
కంభంపాటి రాయబారం మర్చిపోయారేమో!
నిన్న చంద్రబాబు అమిత్ షాను కలవడానికి వెళ్లారు. అంతకు కొన్ని రోజుల ముందే టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహనరావు అమిత్ షాను కలిసి మాట్లాడి వచ్చారు. మరి పాత తప్పులన్నింటికీ బాంచెన్ దొర అని చెప్పొచ్చేరేమో తెలియదు గానీ మొత్తానికి షా గారు మన బాబుగారితో మాట్లాడటానికి ఒప్పుకున్నారు.
పాపం అర్ధరాత్రి వరకు వేచి ఉండి..
అమిత్‌షాను, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలవడానికి బాబు పడిగాపులు కాయాల్సి వచ్చింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో భేటీ ఉంటుందనుకుని వెళితే 11.30 వరకు ఆయన దర్శనమే లభించలేదట. పార్లమెంటు నడుస్తుండటంతో ఆ టైమ్ వరకు బీజేపీ అగ్రనేతలు అందుబాటులో లేరు. వారొచ్చేవరకు వేచి ఉండి కలిసి వెళ్లారు చంద్రబాబు.