ఇంత సంస్కార హీనమైన భాషనా.. చంద్రబాబూ?
టీడీపీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తోందని ఏపీ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ మల్లాది విష్ణు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు.
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నోటికి హద్దూ అదుపూ లేదు. ఆయన నోటి నుంచి ఎప్పుడు కూడా సభ్యతతో కూడిన భాష వెలువడదు. మార్కాపురం, ఎమ్మిగనూరు, బాపట్ల బహిరంగ సభల్లో చంద్రబాబు వాడిన భాష పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నిక కమిషన్ (ఈసీ) నోటీసులు జారీ చేసింది. అయినా ఆయనకు బుద్ధి రాలేదు. ఆయన సంస్కారహీనత ఆయన ప్రసంగాల ద్వారా బయటపడుతూనే ఉంది.
టీడీపీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తోందని ఏపీ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ మల్లాది విష్ణు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వాడిన భాషపై ఈసీ నోటీసులు జారీ చేసినప్పటికీ పద్ధతి మార్చుకోలేదని ఆయన అన్నారు.
‘సైకో పోవాలి.. సైకిల్ రావాలి’ అనే శీర్షికతో టీడీపీ రూపొందించిన పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కించపరుస్తూ ఆ పాటను ఐ-టీడీపీ వెబ్ సైట్లో పదే పదే ప్లే చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఆ పాటలో కులం, మతం ప్రస్తావన కూడా తెచ్చారు.
సీమ చెల్లెమ్మ పాట పట్ల కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా ఆ పాట ఉందని ఆయన చెప్పారు.