Telugu Global
Andhra Pradesh

ఏపీ అప్పులపై చంద్రబాబు అస‌త్య‌ ప్రచారం: ఇదీ అసలు విషయం

2023 మే నాటికి ఆంధ్రప్రదేశ్‌ అప్పులు రూ.6.30 లక్షల కోట్లు. వీటిలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు తీసేస్తే జగన్‌ ప్రభుత్వం చేసిన అప్పులు ఏమిటో సులభంగా తెలిసిపోతుంది.

ఏపీ అప్పులపై చంద్రబాబు అస‌త్య‌ ప్రచారం: ఇదీ అసలు విషయం
X

అబద్ధాలు ప్రచారం చేయడం, అవే నిజమని నమ్మించడం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. అబద్ధాలను ఆయన వండి వారుస్తూ ఉంటారు. అన్ని విషయాల్లో మాదిరిగానే వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పులపైనా ఆయన అసత్య ప్రచారానికి తెర తీశారు. జగన్‌ ప్రభుత్వం 13 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని చంద్రబాబు ఆరోపించారు. ఆయన అనుంగు అనుచరుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాత్రం రూ.10 లక్షల కోట్ల అప్పు అని ఆరోపిస్తున్నారు. అబద్ధాలు చెప్పడంలో కూడా ఒక పద్ధతిని పాటించాలనే విషయం తెలుగుదేశం పార్టీ నేతలకు లేకుండా పోయింది.

నిజానికి, గ‌త చంద్రబాబు ప్రభుత్వం నుంచి జగన్‌ ప్రభుత్వానికి సంక్రమించిన అప్పులు రూ.4 లక్షల కోట్లు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పెరిగిన అప్పులు అసలు లెక్కలోకి కూడా రావు. 2023 మే నాటికి ఆంధ్రప్రదేశ్‌ అప్పులు రూ.6.30 లక్షల కోట్లు. వీటిలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులు తీసేస్తే జగన్‌ ప్రభుత్వం చేసిన అప్పులు ఏమిటో సులభంగా తెలిసిపోతుంది. జగన్‌ ప్రభుత్వంలో కేవలం 12 శాతం మేర మాత్రమే అప్పులు పెరిగాయి.

ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి మాత్రమే అప్పులు తీసుకుంటాయనే విషయాన్ని తమ సౌకర్యం కోసం టీడీపీ మరిచిపోతున్నది. ఆ వివరాలేమీ రహస్యం కావు, ఎవరైనా చూసుకోవచ్చు. రాజ్య‌స‌భ‌లో టీడీపీ సభ్యుడు కనకమేడల వేసిన ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన సమాధానాన్ని కూడా వారు పరిగణనలోకి తీసుకోరు. ఆంధ్రప్రదేశ్‌ అప్పులు, రాబడి గురించి కేంద్రం పార్లమెంటు సాక్షిగా చెప్పింది. ఆ విషయాలను పరిశీలించినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్థమవుతుంది.

పెండింగ్‌ బిల్లులు రూ.1.70 లక్షల కోట్లు ఉన్నట్లు కూడా అసత్య ప్రచారం చేస్తున్నారు. ఉదయ్‌ బాండ్లను 2016లోనే, అంటే చంద్రబాబు హయాంలోనే తీసుకున్నారు. జగన్‌ ప్రభుత్వంలో రెవెన్యూ 16 శాతం వృద్ధిని సాధించింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో స్థూల ఉత్పత్తి 6.95 లక్షల కోట్లు ఉంటే, జగన్‌ ప్రభుత్వ హయాంలో రూ.10 లక్షల కోట్లుగా నమోదైంది.

నిజానికి, చంద్రబాబు హయాంలో తీసుకున్న‌ అస్తవ్యస్త విధానాల వల్ల జగన్‌ ప్రభుత్వం అప్పు చేయాల్సి వచ్చింది. పైగా, కోవిడ్‌ కాలంలో జగన్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రశంసలు అందుకున్నాయి. రాష్ట్ర రాబడిపై కోవిడ్‌ ప్రభావం కూడా ఉంటుందనే విషయాన్ని గమనించి టీడీపీ నాయకులు మాట్లాడితే బాగుంటుంది. జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయనే విషయాన్ని మరిచిపోకూడదు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో సంక్షేమ కార్యక్రమాలే లేవు.

First Published:  23 Jan 2024 9:35 AM IST
Next Story