చంద్రబాబు దాసోహం.. ఒక చరిత్రాత్మకమైన విద్రోహం..!
బీజేపీ పంచన చేరడం అంటే ఆత్మవంచన అని బాబుకి తెలియదా..? తెలుసు. ముస్లింలు, దళితుల్ని నట్టేట ముంచేయడం అని తెలియదా..? తెలుసు. అయినప్పటికీ ఇంత దుర్మార్గానికి ఎందుకు ఒడిగట్టినట్టు..? మొదటిది, దళితులూ, ముస్లింలంటే అలుసు.
చంద్రబాబు సాధించాడు. చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందే చంద్రబాబు నక్కని తొక్కారు. తెల్లవారుజామున కల్లోకి వస్తున్న జగన్మోహన్‌రెడ్డి భయం నుంచి కొద్దిపాటి రిలీఫ్ దొరికింది. బాబు గారిది సింగిల్ పాయింట్ ప్రోగ్రాం. మళ్లీ ముఖ్యమంత్రి అయితీరాలి, జగన్ మీద కక్ష సాధించాలి, ఆ మాత్రం కసి ఉండటం సహజమే..! జగన్ కేవలం చంద్రబాబుని ఎన్నికల్లో చిత్తు చేయడమే కాదు, రాజమండ్రి జైల్లో ఊచలు లెక్కబెట్టించాడు, కడుపుమండదా మరి. ఐతే ఒక నాయకుడు మరో నాయకుడి మీద పగ సాధించడం కోసం, అమాయక జనాన్నీ, వారి ప్రయోజనాల్ని తాకట్టుపెట్టడం అభ్యంతరకరం.. దారుణం..!
‘‘మీకెన్ని అసెంబ్లీ సీట్లు, ఎన్ని పార్లమెంట్ స్థానాలు కావాలి..? మీరేం చెబితే అది చేస్తాను’’ అని బీజేపీ అగ్రనాయకత్వం ముందు సాష్టంగ పడటం అంటే.. ఒకటి: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉన్న ముస్లింలు అందరినీ మోసం చెయ్యడం. లాల్‌జాన్ బాషా ఆశయాన్ని తుంగలో తొక్కడం. పేద ముస్లింల ప్రయోజనాల పాలకుండలో విషం కంపడం.
రెండు: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విస్తరించి ఉన్న లక్షలాది దళిత జనాన్ని అవమానించడం, వాళ్లని ఇంకా హీనులుగా దీనులుగా ఉంచడానికి ఆధిపత్యకులంతో అక్రమ సంబంధం పెట్టుకోవడం..! మాలలూ, మాదిగలూ, క్రిస్టియన్ల భవిష్యత్ మీద ఒక దురహంకారపు చీకటి తెర దించడం. దళిత తల్లుల్నీ, చెల్లెళ్లనీ ఘోరంగా అవమానించడం.
మూడు: ఎగిరిపడుతున్న పవన్ కళ్యాణ్ కాళ్లునరకడం. అంటే, బీజేపీకి కోరినన్ని సీట్లుయిచ్చి, కాపుల సీట్లకి కన్నం పెట్టడం..! స్నేహం చేసినందుకు ద్రోహం చెయ్యడం బాబుకి బాగా తెలిసిన విద్య. కాపుల ఎన్నటికీ తనని నమ్మరు అనే భయం చంద్రబాబుకి ఎలాగూ ఉంది. కనక ఇటు జనసేన– అటు బీజేపీ.. కుడి ఎడమల డాల్ కత్తులు మెరయగ, రాజకీయ కథకళిని రక్తి కట్టించాలని నారావారి దురాలోచన.
అయితే, బీజేపీ పంచన చేరడం అంటే ఆత్మవంచన అని బాబుకి తెలియదా..? తెలుసు. ముస్లింలు, దళితుల్ని నట్టేట ముంచేయడం అని తెలియదా..? తెలుసు. అయినప్పటికీ ఇంత దుర్మార్గానికి ఎందుకు ఒడిగట్టినట్టు..? మొదటిది, దళితులూ, ముస్లింలంటే అలుసు.
పేదవాళ్లూ కదామరి..! నోరెత్తి ప్రశ్నించలేరు కదా. కాసినిడబ్బులూ, సారా ప్యాకెట్లతో సర్దిచెప్పుకోవచ్చని ధీమా. బీసీలు ఎలాగూ టీడీపీని నమ్ముకొని ఉన్నారనే భరోసా..! అయినా, వీటన్నిటి కంటే ముఖ్యమైందీ, ప్రాణం మీదికొచ్చేది ఒకటి ఉంది.. అది.. వేలకోట్ల అవినీతి. అతి తెలివి చంద్రబాబు ఎంత స్కిల్ చూపించినా రాజమ్రండి జైల్లో 50 రోజులు అవమానకరమైన శిక్ష అనుభవించక తప్పలేదు. కేంద్రంలో బీజేపీ అండ ఉంటే కేసుల నుంచి తప్పించుకోవచ్చు, సొంత వ్యాపారాల్ని ఇష్టారాజ్యంగా నడిపించుకోవచ్చు. ముఖ్యమంత్రిగా అధికారం చెలాయించవచ్చు.. ఇదీ అసలు గేమ్ ప్లాన్.
ఈ క్షుద్ర ఆలోచన నెరవేరుతుందా..? గాయపడిన ముస్లిం సమాజం ఎదురు తిరిగితే.. దళిత వాడలు నిరసనాగ్ని జ్వాలలై తిరగబడితే.. మాకు ఇచ్చినవి అసెంబ్లీ సీట్లూ, విదిలించిన అన్నం మెతుకులా..? అని కాపులు ఆగ్రహించి నీ అంతు చూస్తా అంటే.. అసలీ మతోన్మాదంతో మిలాఖత్ ఏమిటని కమ్మవాళ్లలోని ఆధునికులూ, హేతువాదులూ, కమ్యూనిస్టులూ చంద్రబాబుని అసహ్యించుకుంటే...
మూసుకుని, తపస్సు చేసుకోవడానికి, చంద్రగిరి గుహల్లోకి గోచీపెట్టుకు పోవాల్సిందే..!