Telugu Global
Andhra Pradesh

అమరావతి ఫిక్స్.. 9న ప్రమాణ స్వీకారోత్సవం

అమరావతి ఏపీకి ఏకైక రాజధాని అని చెబుతూ వచ్చిన చంద్రబాబు.. అక్కడే ముఖ్యమంత్రిగా బాధ్యలు తీసుకోబోతున్నారు.

అమరావతి ఫిక్స్.. 9న ప్రమాణ స్వీకారోత్సవం
X

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈనెల 9న చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందనే వార్తలు వినపడుతున్నాయి. వాస్తవానికి జూన్-9న విశాఖ కేంద్రంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ నేతలు ఎన్నికల తర్వాత నమ్మకంగా చెబుతూ వచ్చారు. కానీ ఫలితాలు తారుమారయ్యాయి. టీడీపీ తరపున జూన్-9న మహూర్తం ఉంటుందని ఎవరూ ముందస్తుగా చెప్పలేదు కానీ, ఇప్పుడు ముహూర్తం ఫిక్స్ అయిందనే వార్తలు వినపడుతున్నాయి. కూటమి గెలిస్తే చంద్రబాబే ముఖ్యమంత్రి అని ఇది వరకే నారా లోకేష్ పరోక్షంగా హింటిచ్చేశారు కూడా. దీంతో కూటమిలో చర్చలు, సంప్రదింపులేవీ లేకుండానే ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి రంగం సిద్ధమవుతోంది.

అమరావతిలోనే..

జగన్ గెలిస్తే విశాఖలో ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని అనుకున్నారు. కానీ చంద్రబాబు గెలిచే సరికి ప్లేస్ అమరావతికి షిఫ్ట్ అయింది. అమరావతి ఏపీకి ఏకైక రాజధాని అని చెబుతూ వచ్చిన చంద్రబాబు.. అక్కడే ముఖ్యమంత్రిగా బాధ్యలు తీసుకోబోతున్నారు.

ఊహించని విజయం..

వైసీపీ కలలో కూడా ఊహించని పరాజయం ఇది. అదే సమయంలో కూటమి కూడా ఈ విజయాన్ని ఊహించలేదు. ఏపీలో ఎవరు గెలిచినా బొటాబొటి మెజార్టీ వస్తుందని చాలామంది సెఫాలజిస్ట్ లు అంచనా వేశారు. వైసీపీ గెలుస్తుందని చెప్పిన ఆరా మస్తాన్ కూడా మెజార్టీ అతి స్వల్పమేనన్నారు. కానీ ఎవ్వరి ఊహలకు అందని విధంగా ఇక్కడ ఫలితాలు వచ్చాయి. 2014లో వైసీపీ ఏపీలో 67 స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష పార్టీగా ఉంది. 2019లో 151 స్థానాలతో రికార్డ్ స్థాయి మెజార్టీతో ప్రభుత్వాన్ని స్థాపించింది. 2024నాటికి పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. కనీసం 2014లో వచ్చిన సీట్లు కూడా ఈసారి వైసీపీకి రాలేదు. ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుందో లేదో తెలియని పరిస్థితి.

First Published:  4 Jun 2024 7:23 AM GMT
Next Story