Telugu Global
Andhra Pradesh

ఇవాళ హైదరాబాద్‌కు చంద్రబాబు

నారా లోకేష్‌ సైతం పోలింగ్ ముగిసిన వెంటనే ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లారు. లోకేష్‌ పర్యటన వివరాలను సైతం టీడీపీ గోప్యంగా ఉంచింది.

ఇవాళ హైదరాబాద్‌కు చంద్రబాబు
X

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇవాళ విదేశాల నుంచి తిరిగి రానున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఈ నెల 19న ఆయన విదేశాలకు వెళ్లారు. అయితే చంద్రబాబు ఏ దేశం వెళ్లారనేదానిపై క్లారిటీ లేదు. మీడియా సైతం ఆయన ఏ దేశానికి వెళ్లారనే విషయాలను బహిర్గతం చేయలేదు.

అయితే పార్టీ వర్గాలు మాత్రం ఆరోగ్య పరీక్షల నిమిత్తం చంద్రబాబు అమెరికా వెళ్లారని చెప్పుకొచ్చాయి. దాదాపు పది రోజుల పాటు విదేశాల్లో గడిపిన చంద్రబాబు.. ఇవాళ తిరిగి ఇండియాకు రానున్నారు. చంద్రబాబు రేపు ఏపీకి రానున్నారని సమాచారం.

నారా లోకేష్‌ సైతం పోలింగ్ ముగిసిన వెంటనే ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లారు. లోకేష్‌ పర్యటన వివరాలను సైతం టీడీపీ గోప్యంగా ఉంచింది. నారా లోకేష్‌ రెండు, మూడు రోజుల్లో ఇండియాకు వస్తారని సమాచారం. మరోవైపు ఏపీ సీఎం జగన్‌ ఫ్యామిలీతో కలిసి లండన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన జూన్ 1న ఏపీకి రానున్నారు.

First Published:  29 May 2024 3:38 AM GMT
Next Story