Telugu Global
Andhra Pradesh

యూత్‌కి నమ్మకం కలగడం లేదా?

చంద్రబాబు తన మాట నిలుపుకుంటారనే నమ్మకం యూవతలో తగ్గిపోతుందట. కారణం ఏమిటంటే పార్టీలో యువత+వారసులకి కూడా టికెట్లు ఇచ్చేదిలేదని చెప్పేస్తున్నారట.

యూత్‌కి నమ్మకం కలగడం లేదా?
X

వచ్చే ఎన్నికల్లో 40 శాతం టికెట్లు యువతకు కేటాయించబోతున్నట్లు చంద్రబాబునాయుడు చెప్పారు. ఈ ప్రకటనను చాలాసార్లు చాలా వేదికల మీద ప్రకటించారు. దాంతో అప్పట్లో కొందరు యువత ఉత్సాహంగా పార్టీలో పనిచేసినా తర్వాత అందరు చప్పబడిపోయినట్లు సమాచారం. కారణం ఏమిటంటే చంద్రబాబు తన మాట నిలుపుకుంటారనే నమ్మకం యూవతలో తగ్గిపోతుందట. కారణం ఏమిటంటే పార్టీలో యువత+వారసులకి కూడా టికెట్లు ఇచ్చేదిలేదని చంద్రబాబు చెప్పేస్తున్నారట.

నిజానికి యూత్+వారసులంటే టికెట్ గ్యారెంటీ ఉండాలి. కానీ రివర్సులో కొందరికి టికెట్లు ఇచ్చేదిలేదని చెప్పేస్తుండటంతోనే మిగిలిన యూత్‌కి కూడా అనుమానాలు పెరిగిపోతున్నాయట. శ్రీకాకుళం జిల్లాలోని రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో స్పీకర్‌గా పనిచేసిన ప్రతిభా భారతి కూతురు గ్రీష్మ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో ఆమె యాక్టివ్‌ గానే ఉంటారు. అయినా ఆమెకు టికెట్ ఇచ్చేదిలేదని చెప్పేశారట. యూత్ కోటా+ప్రతిభా భారతి వారసురాలిగా కూడా గ్రీష్మను చంద్రబాబు పట్టించుకోవటంలేదని సమాచారం.

ఇక అనంతపురం, తాడిపత్రిలో కూడా జేసీల వారసులకు టికెట్లపై హామీ ఇవ్వలేదట. అందుకనే జేసీ బ్రదర్స్ కూడా బాగా అసంతృప్తిగా ఉన్నారు. ఇక ధర్మవరంలో పరిటాల శ్రీరామ్‌కు కూడా గ్యారెంటీ ఇవ్వలేదట. రాప్తాడులో పరిటాల సునీత పోటీ ఖాయమే. మరి ధర్మవరం ఇన్‌చార్జిగా పనిచేస్తున్న తనకు కూడా టికెట్ ఇవ్వాల్సిందే అని శ్రీరామ్ ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు ఏమీ చెప్పలేదట. శ్రీకాళహస్తిలో మాత్రం బొజ్జల సుధీర్‌కు టికెట్‌ ఖాయం చేశారు. అంటే అక్కడ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి లేరు కాబట్టి ఇచ్చారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

వారసుల్లో కూడా ఒక్కో నియోజకవర్గంలో ఒక్కోలాగ వ్యవహరిస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో కేఈ కృష్ణమూర్తి కొడుకు శ్యామ్ కుమార్ పోటీ విషయంపై కూడా ఏమీ తేల్చలేదు. విశాఖ జిల్లాలోని అరకు నియోజకవర్గంలో ఫిరాయింపు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కొడుకు శ్రవణ్ కుమార్ విషయంలో కూడా నాన్చుతున్నారట. ఈ ఉదాహరణలన్నీ చూసిన తర్వాత యూత్‌కు గ్యారెంటీగా టికెట్లిచ్చే విషయంలో చంద్రబాబు మీద నమ్మకం పోతోందట. మరి చంద్రబాబు ఎలా మ్యానేజ్ చేస్తారో చూడాలి.

First Published:  1 Aug 2023 10:49 AM IST
Next Story