అది బుసకొట్టే రాజకీయ విషసర్పం..
పెద్దగా నమ్మకాలు లేని చంద్రబాబు పూజలూ, యాగాలూ ముందే మొదలుపెట్టేశారు. పవన్ కల్యాణ్ పుణ్యమాని, బీజేపీ వారి రెండు పువ్వుల్నీ బాబుగారు రెండు చెవుల్లో పెట్టించుకున్నారు. ఇంత దుర్గతి బాబుకి ఎందుకు పట్టినట్టు..? దేనికింత దిగజారుడు..?
పాతకాలం నాటి రాజకీయ నాయకుడు గోగినేని రంగా, ఏ ఎండకాగొడుగు పట్టే వేషాలు వేస్తున్నప్పుడు, శ్రీమాన్ గోగినేని రంగా కోట్లు మార్చి ప్లేట్లు మార్చి కులుకు విలాసంగా, క్రూరంగా, ఘోరంగా, ఛీరంగా, ధూరంగా అని వెటకరించారు మహాకవి శ్రీశ్రీ.. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అలాంటి పనుల్లో చాలా బిజీగా ఉన్నారు.
అటు చూసీ, ఇటు చూసీ, గోడ దూకి, తలుపులేసి బీజేపీ కాళ్లు పట్టుకున్నారు. చివరికి ఎన్డీఏలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఎవరైనా బీజేపీలో చేరవచ్చు, తప్పులేదు. కేంద్రానికి సహకరించడం నేరం కాదు. అయితే బీజేపీని మతతత్వ పార్టీ అని విమర్శించి, ఒక దేశ ప్రధానమంత్రిని అనరాని మాటలతో తిట్టి, తూలనాడి.. ప్రజల ముందు ఉపన్యాసాలు దంచిన చంద్రబాబు అదే పార్టీ పల్లకీ మోయడానికి ఎలా సిద్ధమైపోతారు..?
పైకంతా ఆ బాబుది డాబూ దర్పం, అది బుసకొట్టే రాజకీయ విషసర్పం అని అందరికీ తెలిసిపోయేలా ఆయనే ప్రవర్తిస్తున్నారు. కమ్యూనిస్టు, మార్క్సిస్టు పార్టీలను రెండు భుజాల మీదా ఎక్కించుకున్న ఆనాటి చంద్రబాబు నాయుడే, ఇప్పుడు నరేంద్రమోడీ చంకలో దూరబోతున్నారు. టోపీపెట్టుకుని, మసీదులకు వెళ్లి, ప్రార్థనలు చేసి ముస్లింలు నా సోదరులన్న వాడే ఇప్పుడు హిందుత్వంతో బంధుత్వం అంటున్నాడు. ఒక దళితుణ్ణి పార్లమెంట్ స్పీకర్ని చేశానని ఆనాడు జబ్బలు చరుచుకున్న చంద్రబాబే భారతీయ జనతా భజన బృందంలో చేరిపోతున్నారు. అధికారం కోసం ఎంత నీచానికైనా ఒడిగట్టే అల్పులు ఉంటారు. తెలుగుదేశం ప్రజల పార్టీ అనీ, తాను లౌకికవాదిననీ, విజనరీని అనీ గప్పాలు కొట్టుకునే వాడే అమిత్ షాతో పిలిపించుకుని, రెండు చేతులూ కట్టుకుని వెళ్లి స్వచ్ఛందంగా లొంగిపోవడం సిగ్గుమాలిన తనానికి చిట్ట చివరి మెట్టేగా..!
పెద్దగా నమ్మకాలు లేని చంద్రబాబు పూజలూ, యాగాలూ ముందే మొదలుపెట్టేశారు. పవన్ కల్యాణ్ పుణ్యమాని, బీజేపీ వారి రెండు పువ్వుల్నీ బాబుగారు రెండు చెవుల్లో పెట్టించుకున్నారు. ఇంత దుర్గతి బాబుకి ఎందుకు పట్టినట్టు..? దేనికింత దిగజారుడు..?
1. ముఖ్యమంత్రి పదవి.
2. సొంత వ్యాపారాల విస్తరణ, పరిరక్షణ.
3. మళ్లీ జైలుకి వెళ్లకుండా, కేసులు కాళ్లకి చుట్టుకోకుండా ముందు జాగ్రత్త.
4. లోకేష్ బాబుని బుజ్జి ముఖ్యమంత్రిగా ప్రజల చంక ఎక్కించడం.
5. గెలిస్తే, వెవ్వెవ్వే అంటూ పవన్ కల్యాణ్‌కి వొట్టి చేతులు చూపించడం.
6. అసంఖ్యాకంగా ఉన్న కాపుల్ని తొక్కిపెట్టి, కమ్మ సామ్రాజ్య పతాకాన్ని ఎగరేయడం.
7. నమ్ముకున్న సామాన్య జనాన్ని నట్టేట ముంచి, నేనే మీ నాయకుణ్ణి అని వికటాట్టహాసం చేయడం.
భశుం..!