నాకు చేతకాదు, నేను చెయ్యలేను.. ఒప్పుకున్న చంద్రబాబు
సీపీఎస్ రద్దు తన వల్ల కాదని చేతులెత్తేశారు చంద్రబాబు. ఈరోజు ఆయన ప్రకటించిన మేనిఫెస్టోలో సీపీఎస్ ప్రస్తావన కూడా ఉంది.
జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేశారా..? అంటూ చంద్రబాబు రాగం తీస్తుంటే.. పోనీ ఈయనొస్తే చేస్తారేమో అనుకున్నారంతా..
జగన్ సీపీఎస్ రద్దు చేశారా..? అంటూ చంద్రబాబు నిగ్గదీసినట్టు అడుగుతుంటే.. పోనీ ఆయనొస్తే రద్దు చేస్తారేమో అని ఆశపడ్డారు ఉద్యోగులు..
పదే పదే ఈ రెండు విషయాలను చంద్రబాబు ప్రస్తావిస్తుంటే.. ఆయన మేనిఫెస్టోలో వీటిని ఘనంగా ప్రకటిస్తారేమో.. జగన్ ని కార్నర్ చేస్తారేమో అని ఊహించారు కొందరు. కానీ బాబు తన వల్ల కాదని చేతులెత్తేశారు. ఆ రెండు పనులు తాను చెయ్యలేనని ఒప్పుకున్నారు.
టిడిపి అధినేత చంద్రబాబు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ముఖ్య నేతల సమక్షంలో మేనిఫెస్టో విడుదల చేశారు. రేపటి ఆకాంక్షలను సాకారం చేసే విధంగా మేనిఫెస్టో రూపొందించామని నేతలు వెల్లడించారు. #PrajaManifesto#PrajaGalam#VoteForCycle#TDPJSPBJPWinning… pic.twitter.com/T6sEEuHHvO
— Telugu Desam Party (@JaiTDP) April 30, 2024
సీపీఎస్ రద్దు తన వల్ల కాదని చేతులెత్తేశారు చంద్రబాబు. ఈరోజు ఆయన ప్రకటించిన మేనిఫెస్టోలో సీపీఎస్ ప్రస్తావన కూడా ఉంది. తాను అధికారంలోకి వచ్చాక, ఉద్యోగ సంఘాలతో మాట్లాడి, సీపీఎస్ విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతే కానీ, రద్దు చేస్తామని చెప్పే ధైర్యం చేయలేకపోయారు చంద్రబాబు. అంటే అర్థమేంటి..? జగన్ ని కేవలం టార్గెట్ చేయడానికి మాత్రమే సీపీఎస్ రద్దు గురించి ప్రశ్నించిన చంద్రబాబు, తన వంతు వచ్చేసరికి మాత్రం నీళ్లు నమిలారు.
దమ్ము, ధైర్యం చంద్రబాబుకి ఉన్నాయా..?
జగన్ చేయలేని పనులు చేసే దమ్ము, ధైర్యం చంద్రబాబుకి ఉంటే ఆయన మేనిఫెస్టో గురించి ప్రజలు ఆలోచించొచ్చు, కనీసం వాటి గురించి మాట్లాడుకోవచ్చు. కానీ బాబుకి ఆ ధైర్యం లేదు. మద్యపాన నిషేధం హామీ అమలు ఏమైందంటూ.. పదే పదే జగన్ ని ప్రశ్నిస్తున్న బాబు, తాను అధికారంలోకి వస్తే ఆ పని చేస్తానని అన్నారా..? మేనిఫెస్టోలో ఆ హామీని పెట్టారా..? ఆ ఊసే ఎత్తలేదు కాబట్టి జగన్ ని ప్రశ్నించే హక్కు, అధికారం చంద్రబాబుకి లేవన్నమాట. ఈరోజు మేనిఫెస్టోలో ఆ రెండు హామీల గురించి చంద్రబాబు మాట్లాడలేదు కాబట్టి.. రేపటి నుంచి జగన్ హామీలపై ప్రశ్నలు వేసే హక్కు చంద్రబాబు కోల్పోయినట్టే.