Telugu Global
Andhra Pradesh

మళ్ళీ యూటర్న్.. ఎన్డీయే గూటికి చంద్రబాబు

శుక్రవారం రాజశ్యామల యాగం మొదలుపెట్టిన చంద్రబాబు ఆదివారం ఆ యాగం పూర్తవ్వగానే సోమ లేదా మంగళవారం ఢిల్లీకి వెళతారట. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి ఢిల్లీకి వెళ్ళబోతున్న చంద్రబాబు బీజేపీ పెద్దలతో భేటీ అవబోతున్నారు.

మళ్ళీ యూటర్న్.. ఎన్డీయే గూటికి చంద్రబాబు
X

చంద్రబాబునాయుడు రాజకీయ జీవితంలో యూటర్న్‌లే ఎక్కువ. ఏ విషయంలో కూడా స్థిర అభిప్రాయం ఉండదు. అందుకే చంద్రబాబు వైఖరిని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. అందితే జట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే నైజమని వర్ణించింది. ఇప్పుడు విషయం ఏమిటంటే.. వచ్చేవారంలోనే చంద్రబాబు మళ్ళీ ఎన్డీయేలో జాయిన్ అవుతున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేదని, రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కేస్తున్నారంటూ నరేంద్రమోడీని అన‌రాని మాట‌లు, బూతులు తిడుతూ 2018లో చంద్రబాబు ఎన్డీయేలో నుంచి బ‌య‌ట‌కు వచ్చేశారు. మరిప్పుడు మళ్ళీ ఎన్డీయేలోకి ఎందుకు వెళుతున్నారో చంద్రబాబే చెప్పాలి.

ఏపీకి మోడీ ప్రత్యేకహోదా ఇచ్చారా..? రాష్ట్రప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారా..? అని ఎవరైనా అడిగితే చంద్రబాబు ఏమని సమాధానం చెబుతారో.. భవిష్యత్ మీద భయంతోనే చంద్రబాబు మళ్ళీ ఎన్డీయే కూటమిలోకి చేరుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తనతో పాటు లోకేష్ భవిష్యత్తు కూడా అంధకారంలో పడిపోతుందనే భయం పెరిగిపోతోంది. అందుకనే జగన్ నుంచి రక్షణ కోసమే ముందుజాగ్రత్తగా చంద్రబాబు ఎన్డీయేలో చేరుతున్నారు.

శుక్రవారం రాజశ్యామల యాగం మొదలుపెట్టిన చంద్రబాబు ఆదివారం ఆ యాగం పూర్తవ్వగానే సోమ లేదా మంగళవారం ఢిల్లీకి వెళతారట. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కలిసి ఢిల్లీకి వెళ్ళబోతున్న చంద్రబాబు బీజేపీ పెద్దలతో భేటీ అవబోతున్నారు. ముందు చంద్రబాబు లాంఛనంగా ఎన్డీయేలో చేరిన తర్వాతే పొత్తులపై ప్రకటన ఉండబోతోంది. ఆ తర్వాతే సీట్ల సర్దుబాటు ఫైనల్ అవుతుందని సమాచారం. బీజేపీ కోరినట్లుగా అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు ఇవ్వటానికి చంద్రబాబు అంగీకరించారని పార్టీవర్గాల సమాచారం.

ఈ విషయాన్ని చంద్రబాబు సమాచారం ఇచ్చిన తర్వాతే పవన్ తో కలిసి ఢిల్లీకి రమ్మని కేంద్రంలోని పెద్దలు ఆదేశించారట. చంద్రబాబును ఎన్డీయేలోకి తీసుకోవాలని బీజేపీ పదేపదే అడిగిందని ఎల్లోమీడియా సమర్థించుకుంటోంది. అయితే వాస్తవంగా చంద్రబాబే బీజేపీతో పొత్తు కోసం వెంటపడిన విషయం అందరూ చూసిందే. ఏదేమైనా తొందరలోనే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మళ్ళీ ఎన్డీయే గూటిలోకి చేరుకోవటం ఖాయమని తేలిపోయింది.

First Published:  17 Feb 2024 12:02 PM IST
Next Story