Telugu Global
Andhra Pradesh

ఒంగోలు ఎంపీ అభ్యర్థి.. చంద్రబాబు యూటర్న్‌

తాజాగా టీడీపీ అధిష్టానం మాగుంట రాఘవరెడ్డికి టికెట్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. మరోసారి శ్రీనివాసులు రెడ్డినే పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం.

ఒంగోలు ఎంపీ అభ్యర్థి.. చంద్రబాబు యూటర్న్‌
X

ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థి విషయంలో తెలుగుదేశం చీఫ్‌ చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. కొడుకు బదులు తండ్రికే ఎంపీ సీటు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఒంగోలు పార్లమెంట్ టికెట్‌ మరోసారి మాగుంట శ్రీనివాసులు రెడ్డికే చంద్రబాబు ఖరారు చేసినట్లు సమాచారం.

రాబోయే ఎన్నికల్లో తన కొడుకు రాఘవరెడ్డిని పొలిటికల్ ఎంట్రీ చేయించాలని ప్లాన్ చేసుకున్నారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. ఇందులో భాగంగా ఒంగోలు పార్లమెంట్‌ స్థానం నుంచి ఈ సారి తన కొడుకు మాగుంట రాఘవరెడ్డిని బరిలో ఉంచేందుకు ప్రయత్నాలు చేశారు. దాదాపు ఏడాదిన్నర క్రితం నుంచే ఆయన ఈ మాట చెప్తూ వస్తున్నారు. ఇటీవల టీడీపీలో చేరిన టైమ్‌లోనూ తన కొడుకు రాఘవరెడ్డి బరిలో ఉంటారని చెప్పారు శ్రీనివాసులు రెడ్డి.

అయితే తాజాగా టీడీపీ అధిష్టానం మాగుంట రాఘవరెడ్డికి టికెట్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. మరోసారి శ్రీనివాసులు రెడ్డినే పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం. ఇందుకు కారణాలు లేకపోలేదు. వైసీపీ తరపున బలమైన అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తుండడంతోనే టీడీపీ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. చెవిరెడ్డితో పోటీని మాగుంట రాఘవరెడ్డి తట్టుకోలేడని.. అందుకని మరోసారి శ్రీనివాసులు రెడ్డిని బరిలో దించాలని టీడీపీ ప్లాన్ చేసింది.

First Published:  26 March 2024 5:20 AM GMT
Next Story